NTV Telugu Site icon

VIDEO: కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..

Video

Video

VIDEO: బెంగళూర్‌లోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఏమైందనే భయాందోళన వ్యక్తం చేశారు. ముక్కు నుంచి రక్తం కారి ఆయన చొక్కాపై పడింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి ఆయనను తరలించారు.

Read Also: Rainbow Children’s Hospital: అగ్రగామి ఫార్మా కంపెనీలతో అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..

ఈ దృశ్యాలు అన్ని అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, చికిత్సపై వివరాల కోసం వేచి చూస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై జేడీఎస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తమ నేతకు ఏం జరిగిందనే ఉత్కంఠ వారిలో ఉంది.

బీజేపీ-జేడీఎస్ సమన్వయ కమిటీ భేటీ ఈ రోజు జరిగింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ హయాంలో ఇటీవల జరిగిన కుంభకోణాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. దీనిపై ఇరు పార్టీలు భేటీ సమయంలోనే కుమారస్వామికి ఈ విధంగా జరిగింది. వచ్చే శనివారం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 3న బెంగళూర్‌లో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఆగస్టు 10న మైసూరులో ముగుస్తుంది.

Show comments