CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- వివాదాస్పదన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కన్నుమూత..
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు జారీ చేసి సంచలనం..
- సీజేఐ సహా సుప్రీం న్యాయమూర్తులకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించడం వివాదాస్పదం..
- కోర్టు ధిక్కార కేసులో జైలుకు వెళ్లిన సిట్టింగ్ న్యాయమూర్తిగా చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Karnan Dies: వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ (71) కన్నుమూశారు. శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. అనేక వివాదాస్పద తీర్పులతో కర్ణన్ ప్రసిద్ధి చెందారు. 2017లో కోల్‌కతాలోని తన నివాసాన్నే తాత్కాలిక కోర్టుగా ప్రకటించి, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఇది ఆ సమయంలో సంచలనంగా నిలిచింది. ఇదే కాకుండా వారికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు ధిక్కార నేరం కింద ఆయనకే 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇలా జైలుకు వెళ్లిన తొలి సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణన్ చరిత్రలో నిలిచారు.
ప్రధాని మోడీకి లేఖ..
2017 జనవరిలో కర్ణన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసి, 20 మంది ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యం ఫిబ్రవరి 8న అప్పటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనపై ధిక్కార చర్యలు ప్రారంభించింది. కర్ణన్‌కు అప్పగించిన న్యాయపరమైన, పరిపాలనాపరమైన బాధ్యతల్ని కూడా ఉపసంహరించుకుంది. మార్చి 31న కర్ణన్ సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆయన, తన అధికారాలను తిరిగి ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అందుకు నిరాకరించింది.
Also Read
- Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
- Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
- Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!
- UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
సుప్రీం న్యాయమూర్తులకు సమన్లు..
దీంతో ఏప్రిల్ 13న ఆయన దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యూ టౌన్ లో ఉన్న తన రోస్డేల్ నివాసానికి విచారణ కోసం హాజరు కావాలని సీజేఐ ఖేహర్‌తో పాటు మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరుకావాలని ఆదేశించారు. తన నివాసమే తాత్కాలిక కోర్టుగా మారిందని కర్ణన్ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమపై కుల వివక్షకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 5 ఏళ్ల శిక్షకు ఆదేశాలు..
దీని తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరుకాకపోవడంతో వారు విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, కుల వివక్ష ఆరోపణలు చేసినందుకు వారి పాస్‌పోర్టులు అప్పగించాలని ఆదేశించారు. మే 2న అప్పటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్‌తో పాటు మరో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ఈ వారెంట్లను ఢిల్లీ పోలీసుల ద్వారా అమలు చేయించాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. ఇదే కాకుండా మే 8న సీజేఐ ఖేహర్ సహా 8 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జాబితాలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె. చెలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్. బానుమతి ఉన్నారు.
సిట్టింగ్ హైకోర్టు జడ్జిగా జైలుకు..
కర్ణన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతి రోజే, 2017 మే 9న సుప్రీంకోర్టు అతడిపై ధిక్కార నేరంలో దోషిగా తేల్చింది. 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన ప్రవర్తన న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణన్ వెంటనే పోలీసులకు చిక్కుండా, నెల రోజుల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. చివరకు జూన్ 20న కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. శిక్ష తర్వాత డిసెంబర్ 2017లో విడుదలయ్యారు.
2020లో మరోసారి అరెస్ట్..
2017లో అరెస్ట్ తర్వాత, 2020లో మరోసారి కర్ణన్ అరెస్టయ్యారు. 020 డిసెంబరులో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, లైంగిక హింసకు సంబంధించిన బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వీడియోల వ్యవహారంలో చెన్నై పోలీసులు ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అనంతరం పుళల్ జైలులో ఉంచారు. 2021 మార్చిలో మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
తాజావార్తలు
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?