NTV Telugu Site icon

DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..

Dy Chandrachud

Dy Chandrachud

DY Chandrachud: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేయడంతో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఎన్ని క‌ఠిన‌ చర్యలు తీసుకున్నప్పటికీ కాలుష్యం మాత్రం తగ్గిపోవడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే విష‌య‌ంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్లడం కూడా మానేసినట్లు వెల్లడించారు. సాధారణంగా తాను ఉదయం 4 నుంచి 4.15 గంట‌ల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్తానని చెప్పారు.

Read Also: KTR: వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్‌ కీలక కామెంట్..

కానీ, ప్రస్తుతం బ‌యటి వాతావ‌ర‌ణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లక‌పోవ‌డం మంచిద‌ని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక, గ‌డిచిన వారం రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ప‌డిపోయింది. దీంతో దేశంలోనే అత్యంత అధ్వానమైన గాలి నాణ్యతను ఢిల్లీలో నమోదు అయింది. రాష్ట్రాలు అవసరమైన కాలుష్య నిరోధక చర్యలను పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, హర్యానా సర్కార్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read Also: Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం.. షరతులు ఇవే..!

ఇక, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఏ అమానుల్లా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంట వ్యర్థాలను కాల్చడాన్ని అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే విషపూరిత పొగలు తరచుగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించేలా చేస్తుందని మండిపడ్డారు. అలాగే, రాజధాని ఏరియాలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటైన సంస్థ తన టార్గెట్ ను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.