NTV Telugu Site icon

Delhi Elections: వరుసగా హ్యాట్రిక్ కొట్టబోతున్న కాంగ్రెస్.. దేంట్లో అంటే…!

Congress

Congress

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుందని సర్వేలు తేల్చాయి. ఇలా వరుసగా ఢిల్లీలో జీరో స్థానాలు సాధించి.. కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఏ సర్వేలోనూ హస్తం పార్టీకి ఒక్క స్థానం కూడా రాదని తేల్చాయి. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ మాత్రం అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాయి.

ఇది కూడా చదవండి: Ramesh Babu: నా న్యాయపోరాటం గెలిచింది.. నిర్మాత శింగనమల రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు

2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు గెలుచుకుంది. ముచ్చటగా మూడోసారి కూడా అవే సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. దాదాపు అన్ని సర్వేల్లో సున్నా సీట్లు వేశాయి. దీనిని బట్టి ఈసారి కూడా కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం లేనట్లే. ఒకప్పుడు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ మంచి బలంగా ఉండేది. ఆమె మరణం తర్వాత మళ్లీ కాంగ్రెస్ పుంజుకోలేదు. ఈసారి బీజేపీ మాత్రం గట్టి ఫైట్ ఇచ్చింది. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది.

 

ఎగ్జిట్ పోల్స్ ఇవే..

పీపుల్స్‌పల్స్‌-కొడిమో
బీజేపీ: 51-60
ఆప్‌: 10-19
కాంగ్రెస్‌: 0
ఇతరులు: 0

టైమ్స్‌ నౌ
బీజేపీ: 39-45
ఆప్‌: 29-31
కాంగ్రెస్‌: 0-2

ఏబీపీ-మ్యాట్రిజ్‌
బీజేపీ: 35-40
ఆప్‌: 32-37
కాంగ్రెస్‌: 0-1

రిపబ్లిపకన్‌ మార్క్‌
బీజేపీ : 39-41
ఆప్‌ : 21-31

చాణక్య
బీజేపీ: 39-44
ఆప్‌: 25-28