NTV Telugu Site icon

Assembly Election Results 2024 Live Updates: జమ్మూకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

Liveupdate

Liveupdate

Assembly Election Results 2024 Live Updates: జమ్మూకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ స్టార్ట్ అయింది. హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

The liveblog has ended.
  • 08 Oct 2024 05:42 PM (IST)

    హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం..

    హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం
    హర్యానాలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీజేపీ
    ఆశలు లేని స్థితి నుంచి అనూహ్య విజయం సాధించిన బీజేపీ
    ఓవర్ కాన్ఫిడెన్స్ తో దెబ్బతిన్న కాంగ్రెస్
    ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించిన బీజేపీ
    6 నెలల ముందే సీఎం పీఠంపై కుర్చున్నా.. పార్టీని గెలిపించుకున్న సైనీ
    1966 నుంచి హర్యానాలో మూడోసారి అధికారం చేపట్టని పార్టీలు
    హర్యానాలో హ్యాట్రిక్ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించిన బీజేపీ
    సత్తా చూపలేకపోయిన INLD, జేజేపీ, ఆప్
    రెండు స్థానాలకే పరిమితమైన INLD
    హర్యానాలో ఖాతా తెరవని ఆమ్ ఆద్మీ పార్టీ
    మూడు స్థానాల్లో ఇతరులు గెలుపు

  • 08 Oct 2024 05:28 PM (IST)

    కేవలం జమ్మూలోని దోబా స్థానంలో ఆప్ విజయం..

    జమ్మూలోని దోబా స్థానం నుంచి ఆప్‌ అభ్యర్థి విజయం. హర్యానాలో ఒక్కసీటు కూడా గెలవలేకపోయిన ఆప్‌.

  • 08 Oct 2024 05:25 PM (IST)

    ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి- కుమారి సెల్జా..

    హర్యానాలో బీజేపీ విజయం దాదాపు ఖాయమైంది. అయితే.. ఈసారి మార్పు వస్తుందని ఊహించిన కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ.. 'మేమంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. కానీ ఎన్నికల ఫలితాలు మాకు నిరాశ కలిగించాయి. మనం దాని గురించి ఆలోచించాలి. హర్యానాలో ఏం జరిగిందో హైకమాండ్ చూడాల్సిందే'నని అన్నారు.

  • 08 Oct 2024 04:59 PM (IST)

    పీడీపీ మూడు స్థానాలకే పరిమితం..

    గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పీడీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

  • 08 Oct 2024 03:59 PM (IST)

    హర్యానాలో బీజేపీ.. జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ముందంజ

    జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి ఎదురుగాలి
    29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ
    జమ్మూ కశ్మీర్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్, ఎన్సీ కూటమి
    జమ్మూ కశ్మీర్ లో 49 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి
    కేవలం 3 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో పీడీపీ
    హర్యానాలో మూడోసారి అధికారం దిశగా బీజేపీ
    స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ
    ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు
    ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
    35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్
    ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఐఎన్ఎల్‌డీ, బీజేపీ, ఆప్

  • 08 Oct 2024 03:19 PM (IST)

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి..

    నౌషేరా అసెంబ్లీ నుండి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సురీందర్ చౌదరి చేతిలో 7 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

  • 08 Oct 2024 02:49 PM (IST)

    బీజేపీ అభ్యర్థి షాగున్ పరిహార్ గెలుపు..

    కిష్త్వార్ నుండి బీజేపీ యువ అభ్యర్థి షాగున్ పరిహార్ విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సజ్జాద్ అహ్మద్ కిచ్లును 500 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.

  • 08 Oct 2024 02:47 PM (IST)

    బారాముల్లాలో ఎన్సీపీ అభ్యర్థి విజయం..

    బారాముల్లా నుండి గెలుపొందిన ఎన్సీపీకి చెందిన అహ్మద్ దార్.. ప్రత్యర్థి యావర్ అహ్మద్ మీర్ పై గెలుపు.

  • 08 Oct 2024 02:17 PM (IST)

    వినేష్ ఫోగట్ ఇంటి వద్ద సంబరాలు..

  • 08 Oct 2024 02:09 PM (IST)

    ఫరూక్‌ అబ్దుల్లా నివాసం వద్ద సంబరాలు..

    నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా నివాసం దగ్గర సంబరాలు.. ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం ఈ ఫలితాల ద్వారా అర్థమైపోయింది- ఒమర్‌ అబ్దుల్లా

  • 08 Oct 2024 02:07 PM (IST)

    హర్యానా సీఎం విజయం

    లడ్వా నుంచి గెలిచిన హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ..

  • 08 Oct 2024 02:01 PM (IST)

    రెండు స్థానాల్లోనూ ఒమర్ అబ్దుల్లా ఆధిక్యం..

    జమ్మూ కాశ్మీర్ లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఒమర్ అబ్దుల్లా ఆధిక్యం..

  • 08 Oct 2024 01:25 PM (IST)

    డూరులో కాంగ్రెస్ ఆధిక్యం..

    జమ్మూకాశ్మీర్ లోని డూరు అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి గులాం అహ్మద్ మీర్ ఆధిక్యం

  • 08 Oct 2024 01:22 PM (IST)

    జమ్మూ బీజేపీ చీఫ్ ఓటమి..

    జమ్మూకాశ్మీర్ లోని నౌషేరా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటమి..

  • 08 Oct 2024 01:21 PM (IST)

    హంద్వారాలో సజ్జద్ ఘనీలోనే విజయం

    జమ్మూకాశ్మీర్ లోని హంద్వారా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సజ్జద్ ఘనీలోనే(JKPC) ఘన విజయం..

  • 08 Oct 2024 01:19 PM (IST)

    బుద్గాంలో ఒమర్ అబ్దుల్లా విజయం..

    జమ్మూకాశ్మీర్ లోని బుద్గాం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విజయం..

  • 08 Oct 2024 01:17 PM (IST)

    పుల్వామాలో పీడీపీ అభ్యర్థి విజయం..

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పీడీపీ అభ్యర్థి వహీద్ పర ఘన విజయం..

  • 08 Oct 2024 01:04 PM (IST)

    హర్యానా బీజేపీ కీలక భేటీ.. సంబరాల్లో కార్యకర్తలు

    హర్యానాలో స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ.. ఫలితాల సరిళిపై బీజేపీ నేతల సమావేశం.. మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్.. సంబరాల్లో హర్యానా బీజేపీ నేతలు, కార్యకర్తలు..

  • 08 Oct 2024 01:00 PM (IST)

    జమ్మూకాశ్మీర్ లో వెలువడుతున్న ఫలితాలు..

    జమ్మూకాశ్మీర్ లో వెలువడుతున్న ఫలితాలు.. బసోహ్లీలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం.. కాంగ్రెస్ పై 16,034 ఓట్ల ఆధిక్యంతో దర్శన్ కుమార్ గెలుపు.. గురేజ్ లో నజీర్ అహ్మద్ ఖాన్(NC)విజయం.. 1,132 ఓట్ల తేడాతో నజీర్ అహ్మద్ కాన్ గెలుపు..

  • 08 Oct 2024 12:53 PM (IST)

    వినేష్ ఫొగట్ ఘన విజయం..

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం.. జులానా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమె.. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్, మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్..

  • 08 Oct 2024 12:48 PM (IST)

    ఆధిక్యంలో మాజీ రెజ్లర్ ఫోగట్

    జులానాలో 6వేల ఆధిక్యంలో ఉన్న మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్..

  • 08 Oct 2024 12:45 PM (IST)

    కుల్గాంలో సీపీఎం ముందంజ

    జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలో సీపీఎం అభ్యర్థి తరిగామి ముందంజ..

  • 08 Oct 2024 12:44 PM (IST)

    లీడ్ లో సావిత్రీ జిందాల్

    హిస్సార్: 5వేల ఓట్ల ఆధిక్యంలో సావిత్రీ జిందాల్(బీజేపీ రెబల్)..

  • 08 Oct 2024 12:42 PM (IST)

    కాంగ్రెస్- బీజేపీ ఓట్షేర్

    హర్యానాలో కాంగ్రెస్ కు 40.57 శాతం ఓట్షేర్, బీజేపీ ఓట్షేర్ 38.80 శాతం.. హర్యానాలో సీట్ల వేటలో కాంగ్రెస్ వెనుకంజ..

  • 08 Oct 2024 12:34 PM (IST)

    హర్యానాలో అధికారం మాదే..

    హర్యానాలో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయి.. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ఎత్తులు పారలేదు.. ప్రజలు ఇండియా కూటమికే పట్టం కట్టారు- రేణుకాచౌదరి

  • 08 Oct 2024 12:33 PM (IST)

    హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది..

    హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. 60కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందన్న పార్టీ సీనియర్ నేత కుమారి షెల్జా

  • 08 Oct 2024 12:31 PM (IST)

    ఈసీపై కాంగ్రెస్ ఫైర్..

    ఈసీ తీరుపై కాంగ్రెస్ అసహనం.. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ డేటా అప్ డేట్ చేయడం లేదంటూ ఆగ్రహం.. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్న బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్.. అధికారులపై బీజేపీ ప్రెషర్ పెడుతుందని కాంగ్రెస్ ఆరోపణ..

  • 08 Oct 2024 12:27 PM (IST)

    హర్యానాలో కాంగ్రెస్ ను దెబ్బ తీసిన ఆప్

    హర్యానాలో పరోక్షంగా కాంగ్రెస్ ను దెబ్బ తీసిన ఆప్.. హర్యానాలో కాంగ్రెస్ దెబ్బ తినడానికి ఆప్ కలవకపోవడమే కారణమంటున్న విశ్లేషకులు..

  • 08 Oct 2024 12:06 PM (IST)

    హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్..

    హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. అంచనాలు తల్లకిందులు చేస్తూ మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ.. 35 స్థానాల్లో కాంగ్రెస్.. సత్తా చూపలేకపోయిన ఐఎన్ఎల్ డీ, జేజేపీ, ఆప్.. వెనకబడ్డ అభయ్ సింగ్ చౌతాలా, దేవీలాల్..

  • 08 Oct 2024 12:02 PM (IST)

    జమ్మూ బీజేపీ చీఫ్ వెనుకంజ

    జమ్మూకాశ్మీర్ లోని నౌషేరాలో బీజేపీ చీఫ్ రవీందర్ రైనా వెనుకంజ

  • 08 Oct 2024 12:02 PM (IST)

    వెనుకంజలో సజ్జద్ లోన్

    జమ్మూకాశ్మీర్ లోని కుప్వారాలో సజ్జద్ లోన్ (JKPC) వెనుకంజ..

  • 08 Oct 2024 11:36 AM (IST)

    మెహబూబా ముఫ్తీ కుమార్తె ఓటమి

    కాశ్మీర్ లో మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి..

  • 08 Oct 2024 11:35 AM (IST)

    హర్యానా- జమ్మూలో ఖాతా తెరవని ఆప్

    హర్యానా, జమ్మూకాశ్మీర్ లో ఖాతా తెరవని ఆప్.. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..

  • 08 Oct 2024 11:33 AM (IST)

    హర్యానాలో బీజేపీ థ్రింలింగ్ విక్టరీ..?

    ఢిల్లీ: బీజేపీ జనరల్ సెక్రటరీలతో జేపీ నడ్డా అత్యవసర సమావేశం.. హర్యానా(90)లో బీజేపీ హ్యాట్రిక్.. హర్యానాలో థ్రింలింగ్ విక్టరీ దిశగా బీజేపీ.. హర్యానాలో 45-50 దిశగా బీజేపీ, 35-40 మధ్యే కాంగ్రెస్.. కాశ్మీర్ లో బీజేపీకి ఊహించని పరాజయం..

  • 08 Oct 2024 11:30 AM (IST)

    జమ్మూలో మెజార్టీ మార్క్ క్రాస్ చేసిన కాంగ్రెస్ కూటమి

    జమ్మూకాశ్మీర్ లో మెజార్టీ మార్క్ ను దాటిన కాంగ్రెస్- ఎన్సీ కూటమి.. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి.. 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ.. ఈసారి బొక్కబోర్లా పడ్డ మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ.. కేవలం 5 సీట్లలో మాత్రమే పీడీపీ లీడింగ్.. జమ్మూలో తప్పిన బీజేపీ లెక్కలు.. ఏమాత్రం ప్రభావం చూపని ఆజాద్ పార్టీ..

  • 08 Oct 2024 11:23 AM (IST)

    వెనుకంజలో మాజీ డిప్యూటీ సీఎం

    వెనుకంజలో మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా(జేజేపీ)

  • 08 Oct 2024 11:22 AM (IST)

    మరోసారి ముందంజలోకి ఫోగట్

    మరోసారి ముందంజలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్

  • 08 Oct 2024 11:19 AM (IST)

    సంబరాల్లో బీజేపీ.. చల్లబడిన కాంగ్రెస్

    హర్యానాలో మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ.. ప్రస్తుతం 49 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ.. 35 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్.. ఈసారి ప్రభావం చూపలేకపోయిన జేజేపీ, ఐఎన్ఎల్డీ, కేవలం ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఆప్.. ఫస్ట్ ట్రెండ్స్ లో వెనకంజలో ఉన్న తర్వాత పుంజుకున్న బీజేపీ.. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకుని ఇప్పుడు సైలెంటైన కాంగ్రెస్ శ్రేణులు..

  • 08 Oct 2024 10:44 AM (IST)

    హర్యానాలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్.

    హర్యానాలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్.. హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు.. హర్యానాలో అనూహ్యంగా ముందంజలో బీజేపీ.. 48 స్థానాల్లో ముందంజలో బీజేపీ.. 35 స్థానాల్లో కాంగ్రెస్..

  • 08 Oct 2024 10:41 AM (IST)

    చండీగఢ్ కు ఏఐసీసీ అబ్జర్వర్లు

    చండీగఢ్ కు వెళ్లనున్న ఏఐసీసీ అబ్జర్వర్లు.. చండీగఢ్ కు అజయ్ మాకెన్, అశోక్ గెహ్లట్, ప్రతాప్ సింగ్ బజ్వా..

  • 08 Oct 2024 10:39 AM (IST)

    ఆధిక్యంలో బీజేపీ రెబల్ జిందాల్

    హర్యానాలో ఆధిక్యంలో బీజేపీ రెబల్ సావిత్రి జిందాల్..

  • 08 Oct 2024 10:38 AM (IST)

    పీడీపీకి భంగపాటు

    జమ్మూకాశ్మీర్ ఫలితాల్లో పీడీపీకి భంగపాటు.. కేవలం మూడు స్థానాల్లోనే పీడీపీ ముందంజ.. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ వెనుకంజ.. 2014లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ.. 1999 తర్వాత పీడీపీకి అత్యంత దారుణమైన ఫలితాలు.. జమ్మూకాశ్మీర్ లో ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి

  • 08 Oct 2024 10:31 AM (IST)

    హర్యానాలో కాంగ్రెస్దే అధికారం

    హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విజయం సాధించబోతున్నాం.. చివరి రౌండ్ కంటే ముందే స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం- భూపేందర్ సింగ్

  • 08 Oct 2024 10:27 AM (IST)

    వినేష్ ఫోగట్ వెనుకంజ

    జులానాలో మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ వెనుకంజ..

  • 08 Oct 2024 10:17 AM (IST)

    మారుతున్న ఫలితాలు..

    హర్యానాలో రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాలు.. క్రమంగా పుంజుకుంటున్న బీజేపీ

  • 08 Oct 2024 10:15 AM (IST)

    పుల్వామాలో పీడీపీ ఆధిక్యం

    పుల్వామాలో పీడీపీ అభ్యర్థి ఆధిక్యం..

  • 08 Oct 2024 10:14 AM (IST)

    వెనుకంజలో మెహబూబా కూతురు..

    ఎన్సీ అభ్యర్థి చేతిలో వెనకబడిన మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ

  • 08 Oct 2024 10:06 AM (IST)

    హర్యానా ఫలితాల్లో ఉత్కంఠ

    ఉత్కంఠ రేపుతున్న హర్యానా ఫలితాలు.. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్.. ఆ తర్వాత లీడ్ లోకి దూసుకొచ్చిన బీజేపీ..

  • 08 Oct 2024 10:03 AM (IST)

    హర్యానాలో మారుతున్న ట్రెండ్..

    హర్యానాలో నిమిష నిమిషానికి మారుతున్న ట్రెండ్.. కాంగ్రెస్- బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ.. ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ..

  • 08 Oct 2024 09:58 AM (IST)

    కాంగ్రెస్- బీజేపీ మధ్య హోరా హోరీ

    హర్యానాలో హోరా హోరీగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ..

Show comments