Rajya Sabha: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక.. మోడీ అభినందన

  • రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక
  • ముచ్చటిగా మూడోసారి ఎన్నిక
  • హరివంశ్‌కు ప్రధాని మోడీ అభినందనలు
Rajyasabha

Rajyasabha

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ముచ్చటిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని… మూడోసారి హరివంశ్‌ నారాయణ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని తెలిపారు. సభా విధానాలు, నియమాలు పట్ల కూడా మంచి అవగాహనం ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన

ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టారు. మరోసారి హరివంశ్‌కే అవకాశం దక్కింది.

ఇది కూడా చదవండి: Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్