Site icon NTV Telugu

Ramdev Baba: వివాదాస్పద వ్యాఖ్యలు.. కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్

Ramdev Baba

Ramdev Baba

ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​.. హరిద్వార్​లో పతంజలి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారని.. అమెరికాను టార్గెట్‌ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రపంచానికే మేము చక్రవర్తులం అంటూ.. మాకంటే గొప్పవారెవరూ లేరు అనుకోవడం తప్పని ఎద్దేవ చేసారు.

read also: Nadendla Manohar: ఆరు వేల కోట్లు స్వాహా.. వాటి లెక్కలెక్కడ?

ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తోందని బాబా రాందేవ్ అన్నారు. ప్రజలందరూ తమ ఇంటి వెలుపల తులసి, కలబంద, తిప్ప మొక్కలను పెంచుతున్నారని, ఈ చెట్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని చెప్పుకొచ్చారు. తన అభిప్రాయప్రకారం తిప్ప చెట్టుపై పరిశోధనలు చేసి.. మందులు తయారు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, కొవిడ్​ చికిత్సలో.. అలోపతి ఔషధాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాని కారణంగానే లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో.. రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
Bonda Umamaheswara Rao: విజయసాయీ.. గోరంట్ల మాధవ్‌పై ట్వీట్ ఎక్కడ?

Exit mobile version