Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- ఆప్‌ను వీడడంపై స్పందించిన హర్భజన్ సింగ్
- ఆ విషయంలో పట్టించుకోకపోవడం వల్లే వీడినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ వీడడంపై మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ స్పందించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరడానికి గల కారణాలను వీడియాకు వివరించారు. క్రీడలు, పంజాబ్‌లోని మాదకద్రవ్యాల సమస్యపై తన అభిప్రాయాలను పార్టీ పట్టించుకోకపోవడమే ఆమ్ ఆద్మీ పార్టీని వీడటానికి కారణమని పేర్కొన్నారు. తాను తన ప్రణాళికలను పార్టీకి చాలాసార్లు సమర్పించినప్పటికీ.. వాటిపై ఎలాంటి చర్య తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఆప్‌తో ఎలాంటి సమస్య లేదు కానీ.. తన అభిప్రాయాలను పట్టించుకోకపోవడంతోనే వీడినట్లుగా చెప్పుకొచ్చారు. తాను ఆప్‌లో చేరిన ఉద్దేశ్యం నెరవేరకపోవడమే పార్టీని వీడాలని నిర్ణయించుకోవడానికి కారణమని తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తనను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరమని అడిగినప్పుడు.. రాజ్యసభలో క్రీడలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడం గురించి చర్చ జరిగిందని చెప్పారు. ‘‘నేను కేవలం క్రీడల గురించి మాత్రమే మాట్లాడతానని ఆ సమయంలో స్పష్టం చేశాను. రాజకీయాల గురించి చర్చించడం నా పని కాదు. పంజాబ్‌లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా క్రీడలను ప్రోత్సహించే అవకాశం లభించడమే నేను ఆప్‌లో చేరడానికి గల ఏకైక కారణం.’’ అని చెప్పుకొచ్చారు.
Also Read
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
హర్భజన్ సింగ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ఆరుగురు పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరారు. క్రీడలకు సంబంధించి తన ఆలోచనలు, ప్రణాళికలను పార్టీకి తెలియజేయడానికి తాను చాలాసార్లు ప్రయత్నించానని, కానీ తన మాట వినలేదని హర్భజన్ పేర్కొన్నారు.
హర్భజన్ బీజేపీలో చేరిన తర్వాత పార్టీని వీడిన ఎంపీలు ద్రోహం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జలంధర్‌లోని హర్భజన్ ఇంటి బయట నిరసనలు జరిగాయి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై ప్రశ్నించగా, నిరసనకారులు ఎవరో, వారు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ‘‘దేశంలోని సామాన్య ప్రజలకు నేను నా క్రికెట్ వల్ల తెలుసు. వారు నాపై ఎంతో ప్రేమను చూపించారు. వారెందుకు నా దిష్టిబొమ్మను తగలబెడతారు లేదా నా ఇంటి బయట ద్రోహి అని రాస్తారు? నేను ఎవరికి ద్రోహం చేశాను?’’ అని ప్రశ్నించారు.
- Tags
- AAP exit
- bjp
- Harbhajan Singh
తాజావార్తలు
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!