Site icon NTV Telugu

H3N2 virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి.. పుదుచ్చేరిలో స్కూళ్ల మూసివేత

H3n2 Virus

H3n2 Virus

H3N2 virus Cases: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను 10 రోజుల పాటు మూసేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. హెచ్3ఎన్2 వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడంతో పుదుచ్చేరి మార్చి 16 నుండి 10 రోజుల పాటు 1 నుండి 8 తరగతులకు పాఠశాలలను మూసివేయనుంది.

Read Also: Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్ సబ్ వేరియంట్ హెచ్3ఎన్2 తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. నిన్న గుజరాత్ రాష్ట్రంలో ఓ మహిళ హెచ్3ఎన్2 వైరస్ వల్ల మరణించింది. ఈ వైరస్ వల్ల దేశంతో తొలి మరణం కర్ణాటక హసన్ లో నమోదు అయింది. హర్యానాలో కూడా హెచ్3ఎన్2 వల్ల మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జనవరి 2 మరియు మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఈ కొత్త వేరియంట్ వల్ల శరీర నొప్పులు, జ్వరం, చలి, అలసట, డయేరియా, వాంతులు, దగ్గు , గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే మార్చి చివరి నాటికి ఫ్లూ వ్యాధి తగ్గుతుందని కేంద్రం ప్రకటించింది. డాక్టర్ల సూచన లేకుండా సొంత మెడిసిన్స్ వాడొద్దని, యాంటీ బయాటిక్ మాత్రలు వాడొద్దని సూచించింది.

Exit mobile version