NTV Telugu Site icon

Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

Gyanesh Kumar

Gyanesh Kumar

భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది. అర్ధరాత్రి సమయంలో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి.

ఇది కూడా చదవండి: Rashmika: సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ లో కూడా శ్రీవల్లే హీరోయిన్..!

ఇక జ్ఞానేష్ కుమార్.. జనవరి 26, 2029 వరకు సీఈసీగా కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ జ్ఙానేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలు ఆయనే పర్యవేక్షించనున్నారు. జ్ఞానేష్ కుమార్.. 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు.

ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీని కలిసిన రిషి సునక్ ఫ్యామిలీ