SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..

  • ముగ్గురు ఎన్నికల కమిషనర్ల కీలక సమావేశం
  • జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు, వివేక్ జోషి భేటీ
  • ఈసీలో విభేదాల వార్తల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత
  • SIR ఆదేశాలు ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని ఈసీ ప్రకటన
  • SIRను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ వెల్లడి
Eci Sir Meeting

Eci Sir Meeting

SIR Row: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), కొత్త ఓటర్ల నమోదు, ECINET, క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖ తదితర అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది.

ఇటీవల ఎస్ఐఆర్‌కు సంబంధించి జ్ఞానేష్ కుమార్‌తో ఇద్దరు కమిషనర్లు విభేదించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో మార్పులు, ఓటర్ల జాబితా యాక్సెస్, ECINET పనితీరు, IT విభాగంలో బాధ్యతల పునర్విభజన వంటి అంశాలపై ప్రశ్నలు వినిపించాయి. వీటి ఆధారంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు.

ఏకగ్రీవంగానే SIR..

SIR ప్రక్రియపై కమిషనర్లలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. 2025 జూన్ 24న SIRను ప్రారంభించడం, షెడ్యూల్స్ కూడా పూర్తిగా ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగిందని తెలిపింది. SIR ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది.

ఫామ్-6లో మార్పులపై వివరణ..

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో మార్పులు SIR సమయంలో చేర్చిన డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. గత SIR ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే సమాచారాన్ని అందించాల్సిన విధానం అమల్లోకి వచ్చింది. ఈ డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ తెలిపింది. అయితే, SIR ప్రక్రియ లేని సమయంలో మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టొరల్ రూల్స్ -1960 కింద నిర్దేశించిన సాధారణ ఫామ్‌లనే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.

ECINET క్లారిటీ..

ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ యాక్సెస్, ECINET పోర్టల్ పనితీరుపై ప్రశ్నలకు ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఫీల్డ్ అధికారులకు వారి చట్టబద్ధ అధికారులకు అనుగుణంగా రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ECINET వ్యవస్థను సమీక్షించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ కమిటీలో ఐఐటీ, ట్రిబుల్ ఐటీకి చెందిన నిపుణులను కూడా చేర్చనున్నారు. భవిష్యత్తులో కొత్త ఐటీ మాడ్యుల్స్, పోర్టల్స్ ఏర్పాటు చేసే ముందు అధికారుల కమిటీ వీటిని పరిశీలిస్తుందని ఈసీ తెలిపింది.

క్యాబినెట్ సెక్రటరీకి లేఖపై ఈసీ క్లారిటీ..

ఎన్నికల సంఘంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ అధికారి బాధ్యతల పునర్విభజనకు సంబంధించి క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖపై ఈసీ స్పందించింది. ఈ లేఖ ఎన్నికల సంఘం విధానాలు, ఐటీ విభాగానికి సంబంధించిన పాలసీ అంశం కాదని, సంబంధిత అధికారి పనితీరుకు సంబంధించిన అంశమని చెప్పింది.

గోవా ఓటర్ల అంశంపై వివరణ..

గోవాలో ఓటర్ల జాబితా నుంచి 97 మంది పేర్లను మినహాయించడంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఈ 97 మంది నుంచి సంబంధిత ఫారమ్‌లనున సేకరించేందుకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లాని గోవా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశించినట్లు ఈసీ చెప్పింది. ఇప్పటికే వారిలో 81 మంది ఫామ్-6 సమర్పించినట్లు తెలిపింది.