SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- ముగ్గురు ఎన్నికల కమిషనర్ల కీలక సమావేశం
- జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు, వివేక్ జోషి భేటీ
- ఈసీలో విభేదాల వార్తల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత
- SIR ఆదేశాలు ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని ఈసీ ప్రకటన
- SIRను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR Row: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), కొత్త ఓటర్ల నమోదు, ECINET, క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖ తదితర అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది.
ఇటీవల ఎస్ఐఆర్కు సంబంధించి జ్ఞానేష్ కుమార్‌తో ఇద్దరు కమిషనర్లు విభేదించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో మార్పులు, ఓటర్ల జాబితా యాక్సెస్, ECINET పనితీరు, IT విభాగంలో బాధ్యతల పునర్విభజన వంటి అంశాలపై ప్రశ్నలు వినిపించాయి. వీటి ఆధారంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు.
Also Read
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
ఏకగ్రీవంగానే SIR..
SIR ప్రక్రియపై కమిషనర్లలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. 2025 జూన్ 24న SIRను ప్రారంభించడం, షెడ్యూల్స్ కూడా పూర్తిగా ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగిందని తెలిపింది. SIR ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది.
ఫామ్-6లో మార్పులపై వివరణ..
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో మార్పులు SIR సమయంలో చేర్చిన డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. గత SIR ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే సమాచారాన్ని అందించాల్సిన విధానం అమల్లోకి వచ్చింది. ఈ డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ తెలిపింది. అయితే, SIR ప్రక్రియ లేని సమయంలో మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టొరల్ రూల్స్ -1960 కింద నిర్దేశించిన సాధారణ ఫామ్‌లనే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.
ECINET క్లారిటీ..
ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ యాక్సెస్, ECINET పోర్టల్ పనితీరుపై ప్రశ్నలకు ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఫీల్డ్ అధికారులకు వారి చట్టబద్ధ అధికారులకు అనుగుణంగా రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ECINET వ్యవస్థను సమీక్షించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ కమిటీలో ఐఐటీ, ట్రిబుల్ ఐటీకి చెందిన నిపుణులను కూడా చేర్చనున్నారు. భవిష్యత్తులో కొత్త ఐటీ మాడ్యుల్స్, పోర్టల్స్ ఏర్పాటు చేసే ముందు అధికారుల కమిటీ వీటిని పరిశీలిస్తుందని ఈసీ తెలిపింది.
క్యాబినెట్ సెక్రటరీకి లేఖపై ఈసీ క్లారిటీ..
ఎన్నికల సంఘంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ అధికారి బాధ్యతల పునర్విభజనకు సంబంధించి క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖపై ఈసీ స్పందించింది. ఈ లేఖ ఎన్నికల సంఘం విధానాలు, ఐటీ విభాగానికి సంబంధించిన పాలసీ అంశం కాదని, సంబంధిత అధికారి పనితీరుకు సంబంధించిన అంశమని చెప్పింది.
గోవా ఓటర్ల అంశంపై వివరణ..
గోవాలో ఓటర్ల జాబితా నుంచి 97 మంది పేర్లను మినహాయించడంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఈ 97 మంది నుంచి సంబంధిత ఫారమ్లనున సేకరించేందుకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లాని గోవా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశించినట్లు ఈసీ చెప్పింది. ఇప్పటికే వారిలో 81 మంది ఫామ్-6 సమర్పించినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?