Site icon NTV Telugu

Gyanesh Kumar: కుంభమేళలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్.. కుటుంబ సభ్యులతో కలిసి స్నానం

Gyaneshkumar

Gyaneshkumar

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు. గంగా మాత ఆశీస్సులు అందరిపై కురిపించాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి..

ఇటీవలే కొత్త భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే ఈ నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. అర్ధరాత్రి సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇక ఆయన నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Kayadu Lohar : అప్పుడు దేఖలేదు.. ఇప్పుడేమో క్రష్ అంటున్నారు!

Exit mobile version