Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని, అందుకే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని గ్వాలియర్ జైలు అధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
జీవిత ఖైదు పడిని దారా సింగ్ అప్పటి నుంచి గ్వాలియర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య జైలు అధికారులకు తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకుంది. తనకు పిల్లలు కావాలని, అందుకే ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను కోరింది. గ్వాలియర్ జైలులో గత ఏడేళ్లుగా దారాసింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి అయిన వెంటనే తన కొడుకు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని, కనీసం పెళ్లి వేడుకలను కూడా ఆస్వాదించలేకపోయానని ఖైదీ తండ్రి కరీం సింగ్ జాతవ్ పేర్కొన్నాడు. తనకు మనవడు కావాలని కోరకుకుంటున్నట్లు వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తన కారణంగా రెండేళ్ల తరువాత పెరోల్ మంజూరు చేయొచ్చు. అయితే సదరు మహిళ అభ్యర్థను జైలు సూపరింటెండెంట్ శివ్ పురి ఎస్పీకి పంపినట్లు తెలిపారు. అయతే దీనిపై అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. అయితే గతంలో కూడా ఓ రాజస్తానీ మహిళ ఇలాంటి అభ్యర్థన పెట్టుకోగా.. అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సంతానం పొందే హక్కు వినియోగించుకునేందు తన భర్తను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జోధ్ పూర్ బెంజ్ ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!