Site icon NTV Telugu

GVL Narasimha Rao: INDIA కూటమిలో ఏకైక సమస్య ఉంది.. జీవీఎల్ కీలక కామెంట్స్

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao Interesting Comments On INDIA Alliance: విపక్షాల కూటమికి INDIA (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌) అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందిస్తూ.. ఈ కూటమిలో ఓ ఏకైక సమస్య ఉందని, అనేకమందిపై అవినీతి అభియోగాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాల్లో కేంద్రం 21 బిల్లులను తీసుకురానుందని స్పష్టం చేశారు. గత పార్లమెంట్ సమావేశాలు చేదు అనుభవంగా మారాయని.. ఆ సమావేశాల్లో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. మోడీ స్పీచ్‌ని అడ్డుకొని, ప్రతిపక్షాలు అరాచకం సృష్టించాయని మండిపడ్డారు.

Seema Haider: సీమా భారత్ కు ఎలా వచ్చింది.. ‘యూపీ ఏటీఎస్’ విచారణలో సంచలన నిజాలు..!

ప్రతిపక్షాలు విధ్వంస ధోరణితో వ్యవహరిస్తున్నాయని.. ఇప్పుడు INDIA పేరుతో కొత్త కూటమి తెరపైకి వచ్చిందని జీవీఎల్ అన్నారు. అసలు ఈ కొత్త కూటమి ఎందుకు? గతంలో ఉన్న కూటమిపై అభ్యంతరాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. తమను తాము రక్షించుకునేందుకు ఒక రక్షణ కవచం కోసం ఈ కూటమిని ఏర్పరుచుకున్నారే తప్ప.. ప్రజల ఎజెండా వాళ్లకు లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను ఫణంగా పెట్టొద్దని కొరారు. రాజకీయ పట్టుదలకు పోతే కష్టమని.. ఏదో కుంటి సాకు చెప్పి పార్లమెంట్‌ను అడ్డుకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. ఎకానమీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నాయన్నారు. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉభయ సభల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపక్షాలు వ్యవహరించాలని సూచించారు.

Ponnam Prabhakar: మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదు.. పొన్నం ప్రభాకర్ కౌంటర్

ఏపీ అభివృద్ధిపై తానే ఎన్నో ప్రశ్నలు పార్లమెంట్‌లో లేవనెత్తానని జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా తామే పార్లమెంట్‌లో చర్చకు తెచ్చామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై తమకున్న చిత్తశుద్ధి మరొకరికి లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. కేంద్రం ఏపీ రాష్ట్రానికే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.

Exit mobile version