Manipur: అమెరికాలో ప్రజల చేతుల్లో గన్నుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ వ్యక్తిగత రక్షణ కోసం లైసెన్స్ ఇచ్చే విధానం సులువుగా ఉంటుంది. అయితే ఇండియాలో వ్యక్తిగత రక్షణ కోసం గన్నుకు లైసెన్స్ తీసుకోవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయి. నిబంధనలు అంత కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ గన్నులకు లైసెన్స్ లు ఇస్తున్నారు. దేశంలో ఎక్కువ లైసెన్స్ డ్ గన్నులు ఉన్న రాష్ట్రం మణిపూర్. మణిపూర్‌లో లైసెన్స్ డ్ గన్నులు ఎక్కువగా ఉన్నాయి. గత 7 ఏళ్లల్లో సుమారు 8 వేలకుపైగా గన్నులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Read also: WI vs IND: ఐదేసిన అశ్విన్.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం! ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసిన యశస్వి
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లోనే ఎక్కువగా మణిపూర్ ప్రభుత్వం అత్యధిక ఆయుధ లైసెన్స్‌లు జారీ చేసింది. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటి సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 26,836 ఆయుధాలకు లైసెన్స్ ఉండగా 2023 నాటికి ఆ సంఖ్య 35,117కు పెరిగింది. కేవలం ఏడేండ్లలో సుమారు 8 వేలకు పైగా ఆయుధాలకు బీరేన్‌సింగ్ సర్కార్ లైసెన్సులు ఇవ్వడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
Read also: PM Modi: ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన.. బాస్టిల్-డేకు ముఖ్య అతిథిగా హాజరు
మణిపూర్ హోం శాఖను అట్టిపెట్టుకున్న బీరేన్‌సింగ్ నేతృత్వంలోనే భారీ స్థాయిలో ఆయుధ లైసెన్సులు జారీ అయ్యాయి. భారీ స్థాయిలో లైసెన్సులు పొందిన అనేకమంది మిలిటెంట్లు, తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతున్నా రు. వీటికి తోడు మే 3 నుంచి సుమారు 3500 ఆయుధాలు.. 5 లక్షలకు పైగా మందుగుండు సామగ్రి దోపిడీకి గురయ్యాయి. దీంతో రాష్ట్రంలో భారీగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆయుధాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో డ్రాప్ బాక్సులను పెట్టడమే అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. మరోవైపు మంత్రి సుసిండ్రో తన ఇంటి ఆవరణలో డ్రాప్ బాక్సును ఏర్పాటు చేసి పరోక్షంగా ఆయుధాల దోపిడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కుకీ తెగ ప్రజలకు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) క్షమాపణలు చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత రెండున్నర నెలలుగా ఎంత ప్రయత్నిస్తున్నా మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పలేకపోతున్నారు. హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.