Gujarati fan made a golden statue of Prime Minister Narendra Modi: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది బీజేపీ. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో విజయం సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. ఇదిలా ఉంటే ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ అభిమాని ఒకరు ఏకంగా 156 గ్రాముల బంగారంతో మోదీ ప్రతిమను తయారు చేశాడు. సూరత్ కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ రాధిక చైన్స్ యజమాన బసంత్ బోహ్రా ప్రధాని మోదీకి అభిమాని. ఆయనపై అభిమానంతో బంగారంతో ఆయన ప్రతిమన తయారు చేయించారు.
Read Also: China: చైనా కుతంత్రం.. ఎల్ఏసీ వెంబడి పోరాట సన్నద్ధతను పరిశీలించిన అధ్యక్షుడు జిన్‌పింగ్
18 క్యారెట్ల బంగారంతో 156 గ్రాముల మోదీ విగ్రహాన్ని తయారు చేసినట్లు బసంత్ బోహ్రా వెల్లడించారు. తాను నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని.. ఆయనకు కోసం ఏదైనా చేయాలని.. దాదాపు 20 మంది కళాకారులతో మూడు నెలల్లో ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారు చేయించానని వెల్లడించారు. ఈ విగ్రహం తయారీకి రూ.11 లక్షల విలువైన బంగారాన్ని వాడారని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా బోహ్రా బంగారం బిజినెస్ లో ఉన్నారు. ఈ విగ్రహానికి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. కొంత మంది కొనుగోలు చేస్తామంటూ ఆఫర్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిని అమ్మాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. గతంలో ‘స్టాచు ఆఫ్ యూనిటీ’ని రూపొందించిన ఆయన దాన్ని విక్రయించారు. బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో దీన్ని ఉంచగా, ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
https://twitter.com/Muthu_Tnbjp/status/1613362845550546944
