Site icon NTV Telugu

Pani puri: “పానీపూరీ” ఎంత పని చేసింది.. రోడ్డుపై మహిళ నిరసన.. వీడియో వైరల్..

Pani Puri

Pani Puri

Pani puri: చాలా వరకు నగరాల్లో, పట్టణాల్లో రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ట్రాఫిక్ వల్ల రోడ్లపై అంతరాయం, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ, గుజరాత్‌లో పానీపూరి వల్ల ఓ మహిళ రోడ్డుపై బైఠాయించిన ఘటన వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుర్సాగర్ లేక్ ప్రాంతంలో ఒక మహిళ తన వీధిలోని వ్యాపారి, తనకు పానీపూరి తక్కువగా ఇచ్చాడని ఆరోపించింది. నిరసనగా రోడ్డుపై కూర్చుని, దిగ్భందించింది.

Read Also: AP Cabinet: 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

వడోదరలో రూ. 20కి 6 పానీపూరీలకు బదులుగా 4 పానీ పూరీలు మాత్రమే ఇచ్చిన తర్వాత మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది. ట్రాఫిక్ మొత్తం ఈ ఘటనలో నిలిచిపోవడంతో, అక్కడి చేరకున్న పోలీసులతో, తనకు మరో రెండు పానీపూరిలు కావాలని కన్నీటితో వేడుకోవడం వైరల్ అవుతోంది. మరో రెండు పానీపూరీల కోసం ఆమె డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గకుండా ధర్నాకు దిగింది.

ఏడుస్తున్న మహిళను పోలీసులు సముదాయించాల్సి వచ్చింది. చివరకు ఆమెకు నచ్చచెప్పి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ సంఘటన ప్రజలకు విచిత్రంగా తోచడంతో చాలా మంది తమ ఫోన్లకు పనిచెప్పారు. ఆమె వాదనల్ని రికార్డు చేశారు. అయితే, చివరకు ఆమెకు పానీపూరి విక్రేత మరో రెండు పానీపూరీలు ఇచ్చాడో లేదో తెలియదు.

Exit mobile version