NTV Telugu Site icon

Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..

Namaz Row

Namaz Row

Namaz Row: గుజరాత్ యూనివర్సిటీలో ఏడుగురు విదేశీ విద్యార్థుల వర్సిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడం వివాదాస్పదమైంది. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన ఆరుగురు, తూర్పు ఆఫ్రికాకు చెందిన మరో విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయడంతో గొడవలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, వీరిని హాస్టల్ ఖాళీ చేయాల్సిందిగా యూనివర్సిటీ కోరింది. మార్చి 16 దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్ఘన్, గాంబియన్ ప్రతినిధి బృందం యూనివర్సిటీ భద్రతా చర్యలపై వైస్-ఛాన్సలర్తో సమావేశం నిర్వహించింది.

Read Also: PM Modi: ఇది “తుక్డే తుక్డే గ్యాంగ్” భాష.. కాంగ్రెస్‌‌పై విరుచుకుపడిన ప్రధాని..

ఈ ఏడుగురు విద్యార్థులు ఎక్కువ కాలంగా హాస్టల్ ‌గదుల్లో ఉంటున్నట్లు వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా తెలిపారు. అందుకే వీరిని ఖాళీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ వ్యక్తులు చదువులను పూర్తి చేసి, కొన్ని పెండింగ్ అడ్మినిస్ట్రేషన్ పనుల కారణంగా హాస్టల్స్‌లో మాజీ విద్యార్థులుగా ఉంటున్నారని ఆమె చెప్పారు. ఇక వారు హాస్టల్‌లో ఉండాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ నిర్ధారించిందని, వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అన్ని పేపర్ వర్క్స్ పూర్తి చేశామని, వారు ఇప్పుడు సురక్షితంగా స్వదేశానికి వెళ్లొచ్చని, సంబంధిత కాన్సులేట్లకు సమాచారం ఇచ్చామని ఆమె చెప్పారు. గుజరాత్ యూనివర్సిటీలో 300 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. రంజాన్ మాసంలో నమాజ్ హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నందున, యూనివర్సిటీ హాస్టల్‌లోకి కొంతమంది ప్రవేశించి విదేశీ విద్యార్థులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్రీలంక, తజకిస్తాన్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.