Site icon NTV Telugu

Gujarat: బౌద్ధం వేరే మతం, హిందువులు మతం మారాలంటే అనుమతి తప్పనిసరి..

Buddism

Buddism

Gujarat: హిందూ మతం నుంచి బౌద్ధమతంలోకి మారాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తప్పనిసరి పొందాలని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బౌద్ధమతాన్ని ‘‘ప్రత్యేకమతం’’ అని స్పష్టం చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం 2003 ప్రకారం బౌద్ధమతం ‘ప్రత్యేక మతం’గా ప్రకటించింది. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకుని హిందూ, బైద్ధ, సిక్కు, జైన మతాన్ని స్వీకరించినట్లైతే, అతను గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం ప్రాకంర జిల్లా మెజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.

Read Also: Herbal Tea : రాత్రి పడుకొనే ముందు ఈ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఈ మేరకు గుజరాత్ హోం శాఖ ఏప్రిల్ 8న సర్క్యులర్ జారీ చేసింది. “బౌద్ధమతంలోకి మారడానికి దరఖాస్తు నిబంధనల ప్రకారం చేయడం లేదని ప్రభుత్వం గమనించిందని, గుజరాత్‌లో ప్రతీ ఏడాది దసరా, ఇతర పండగల సమయంలో ప్రజలు బౌద్ధమతంలోకి మారుతున్నారని, వారంతా నియమాలు పాటించడం లేదని, హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని కొందరు భావిస్తున్నారని” ఉత్తర్వులు పేర్కొన్నాయి.

సర్క్యులర్ ప్రకారం.. “మత మార్పిడికి ముందస్తు అనుమతి కోరుతూ దరఖాస్తులు దాఖలైన సందర్భాల్లో సంబంధిత కార్యాలయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2) ప్రకారం హిందూ మతం పరిధిలోకే సిక్కు, బౌద్ధ, జైన మతాలు వస్తాయని పేర్కొంటూ దరఖాస్తులను పరిష్కరిస్తున్నారని” తెలిపింది. అయితే, గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం ప్రకారం బౌద్ధమతాన్ని ప్రత్యేక మతంగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని హిందూ మతం నుంచి బౌద్ధ, సిక్కు, జైన మతంలోకి మార్చే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, ఇదే కాకుండా మతం మారే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌కి నిర్ణీత ఫార్మాట్‌లో సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version