Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు స్కూల్ కు సెలవు ప్రకటించారు.
Read Also: Meerpet Murder Case: మీర్పేట్లో భార్య హత్య కేసు.. నేడు కోర్టు ముందుకు నిందితుడు!
అయితే, ఈ బాంబు బెదిరింపులపై బాంబు స్క్వాడ్, పోలీసులు ప్రతి చోట క్షుణ్ణంగా గాలిస్తున్నారు. స్కూల్ భవనం మొత్తం శానిటైజ్ చేశారు. మరోవైపు, ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సైబర్ సెల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా వడోదరలోని సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన బెదిరింపులు లేవని ధృవీకరించారు. కానీ, ప్రజల భద్రత కోసం తాము నిరంతరం అందుబాటులో ఉంటామని తేల్చి చెప్పారు. అలాగే, గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి పాఠశాలలకు.. వీటిని తాము తేలిగ్గా తీసులేదన్నారు.