విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది... సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..
Puducherry : పుదుచ్చేరిలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రెడ్డియార్ పాళయం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, 11వ తరగతి విద్యార్థి కత్తితో వచ్చి మరో విద్యార్థిపై దాడి చేశాడు.
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.