NTV Telugu Site icon

Gujarat: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఫైన్ లేదు.. గుజరాత్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Gujarat

Gujarat

No Fine For Breaking Traffic Rules During Diwali: ట్రాఫిక్ ఉల్లంఘించినా పర్వాలేదు.. ఫైన్ లాంటివి ఏమీ ఉండవు. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది కేవలం దీపావళికి మాత్రమే. దీపావళి పండగ వేళ ట్రాఫిక్ ఉల్లంఘించినా.. ఎలాంటి జరిమానా విధించబడదని గుజరాత్ సర్కార్ ప్రకటించింది. గుజరాత్ హోంశాఖ సహాయమంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం సూరత్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.

దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 27 వరకు నిబంధనలు ఉల్లంఘించినా వారికి ఎలాంటి జరిమానా విధించమని అన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మార్గదర్శకత్వం మేరకు రాష్ట్ర హెం శాఖ పండగ సందర్భంగా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘవి వెల్లడించారు.

Read Also: Munugode by poll: బూర నర్సయ్య గౌడ్‌ కు నిరసన సెగ.. డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు

అక్టోబర్ 21 నుంచి 27 వరకు గుజరాత్ పోలీసులు ప్రజల నుంచి ఎలాంటి జరిమానాలు వసూలు చేయరని.. హెల్మెట్ లేకున్నా, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మరేదైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి దొరికితే.. మా పోలీసులు వారికి పువ్వులు ఇస్తారని ఆయన మంత్రి అన్నారు. శుక్రవారం జరుపుకును గోవత్స ద్వాదశీతో ఈ ఏడాది దీపావళి పండగకు నాంది పలికారు. దీపావళిలో ప్రధానమైన లక్ష్మీ పూజ అక్టోబర్ 24న నిర్వహించనున్నారు.

డిసెంబర్ నెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి సర్కార్ ప్రజలకు ఇలాంటి సడలింపులు ఇస్తోంది. మరోసారి గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించగా.. దీపావళి తర్వాత గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.