No Fine For Breaking Traffic Rules During Diwali: ట్రాఫిక్ ఉల్లంఘించినా పర్వాలేదు.. ఫైన్ లాంటివి ఏమీ ఉండవు. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది కేవలం దీపావళికి మాత్రమే. దీపావళి పండగ వేళ ట్రాఫిక్ ఉల్లంఘించినా.. ఎలాంటి జరిమాన విధించబడదని గుజరాత్ సర్కార్ ప్రకటించింది. గుజరాత్ హోంశాక సహాయమంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం సూరత్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.