NTV Telugu Site icon

Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Gujarat Elections

Gujarat Elections

Gujarat election schedule 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.

గుజరాత్ లో మొత్తం 4 కోట్ల 90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2.53 కోట్లు కాగా..మహిళలు 2.37 కోట్ల మంది ఉన్నారు. ట్రాన్స్ జెంటర్లు 1417 మంది ఉన్నారు. మొత్తం 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. 2017 ఎన్నికల్లో 182 స్థానాల్లో బీజేపీకి 99 స్థానాలను, కాంగ్రెస్ పార్టీకి 77 స్థానాలను గెలుచుకుంది. గుజరాత్ అసెంబ్లీలో 142 జనరల్ స్థానాలు ఉండగా.. 13 ఎస్సీ, 27 ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. 8న ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లు ప్రకటించింది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న ఉంటే , రెండో విడత పోలింగ్ 5వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనుంది. హిమాచల్ ఎన్నికల ఫలితాల రోజే గుజరాత్ ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్:

నోటిఫికేషన్- నవంబర్ 5 ( తొలి విడత), నవంబర్ 10 ( రెండో విడత)

నామినేషన్ ప్రారంభం- నవంబర్ 14 (తొలి విడత), నవంబర్ 17 (రెండో విడత)

నామినేషన్ల పరిశీలన- నవంబర్ 15, 18

నామినేషన్ల ఉపసంహరణ- నవంబర్ 17, 21

తొలి విడత పోలింగ్  – డిసెంబర్ 1

రెండో విడత పొలింగ్ – డిసెంబర్ 5

ఓట్ల లెక్కింపు- డిసెంబర్ 8

Show comments