Gujarat Businessman Loses ₹ 2.69 Crore In Sex Video Call Trap: సెక్స్ టార్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఓ గుజరాత్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. సెక్స్ వీడియో కాల్ ట్రాప్ లో ఇరుక్కొని వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లో పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న బాధితుడికి గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి న్యూడ్ కాల్ చేసుకునే వరకు వెళ్లింది. పక్కా పథకం ప్రకారం సదరు యువతి, బాధితుడిని బట్టలు విప్పి ఫోన్ మాట్లాడేలా ప్రోత్సహించింది.
Read Also: Maoist Party Letter: హిడ్మా చనిపోలేదు.. మావోయిస్టు పార్టీ ఓపెన్ లెటర్
దీని తర్వాత బాధితుడికి ఫోన్ చేసి రూ. 50,000 చెల్లించమని డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. లేకపోతే న్యూడ్ వీడియో క్లిప్ సర్క్యూలేట్ చేస్తానని బెదిరించడంతో బాధితుడు డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఢిల్లీ పోలీస్ ఇన్ప్పెక్టర్ గుడ్డు శర్మ అని చెప్పుకుని మరో వ్యక్తి ఫోన్ చేసి, న్యూడ్ వీడియో నా దగ్గర ఉందని రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత ఆగస్టు 14న తనను సైబర్ సెల్ పోలీస్ గా పరిచయం చేసుకుని మరో వ్యక్తి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతూ ఏకంగా రూ. 80.97 లక్షలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
దీని తర్వాత కూడా వ్యాపారవేత్తకు వేధింపులు ఆగలేదు. యువతి సీబీఐని సంప్రదించిందని.. సీబీఐ అధికారులమని చెబుతూ మరికొంతమంది కాల్ చేయడం ప్రారంభించారు. రూ. 8.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇలా పలుమార్లు అడిగినంత ఇచ్చుకుంటూ పోయాడు. చివరకు డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు కేసును క్లోజ్ చేస్తుందని చెబుతూ ఫేక్ ఉత్తర్వులు కూడా పంపారు. అయితే ఇది చూసిన తర్వాత అనుమానం వచ్చిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 11 మందికి రూ.2.69 కోట్లు దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 387 (దోపిడీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 465 (ఫోర్జరీ) 420 (మోసం), మరియు 120-బి (నేరపూరిత కుట్ర) ఇతర నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
