Groom Refuses To Marry Over Bride Poor Marks In 12 Examination: తమకు వధువు నచ్చలేదనో, లేక ఇతరులపై మనసు పారేసుకోవడం వల్లనో.. అబ్బాయిలు తమ పెళ్లిళ్ళను రద్దు చేసుకోవడం వంటి సందర్భాలు వెలుగు చూస్తుంటాయి. కొందరైతే.. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా, ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. కానీ.. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఓ విచిత్రమైన వ్యవహారం వెలుగు చూసింది. ఇంటర్మీడియట్‌లో యువతికి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి.. వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. తీరా తీగ లాడితే.. అప్పుడు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. కట్నం కోసమే వరుడు తరఫు బంధువులు ఈ మార్కుల నాటకం ఆడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
All England Open 2023: పీవీ సింధుకి చేదు అనుభవం.. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం
యూపీలోని కన్నౌజ్ జిల్లా తిర్వ కొత్వాలి ప్రాంతానికి చెందిన సోని అనే అమ్మాయికి బగాన్వా గ్రామానికి చెందిన సోను అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. వీరికి గతేడాది డిసెంబర్ 4వ తేదీన నిశ్చితార్థం జరిగింది. పెళ్లికూతురి తండ్రి ఈ నిశ్చితార్థ వేడుకను రూ.60 వేలు ఖర్చు చేసి మరీ గ్రాండ్‌గా నిర్వహించాడు. అంతేకాదు.. అదే సమయంలో రూ.15 విలువ చేసే బంగారపు రింగ్‌ని సైతం బహూకరించాడు. ఇంకొన్ని రోజుల్లోనే పెళ్లి వేడుక నిర్వహిద్దామని పెళ్లికూతురు తరఫు వారు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే.. ఇంతలోనే వరుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. సోని ఇంటర్మీడియట్ మార్కుల షీట్‌ని పరిశీలించిన అతగాడు.. యువతికి తక్కువ మార్కులు వచ్చాయని పెళ్లి రద్దు చేశాడు. వధువు తరఫు బంధువులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. చివరికి తమ బంధువుల సహాయంతో వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వాళ్లు వినలేదు.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
అయినా.. మార్కులు తక్కువ రావడానికి, పెళ్లికి సంబంధ లేదు కదా! ఇంకా వేరే మేటర్ ఏదో ఉంది? అని తీగ లాడితే.. అసలు విషయం బయటపడింది. అధిక కట్నం ఇవ్వాలని వరుడు తరఫు వారు డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడైంది. తాము ఎక్కువ కట్నం ఇచ్చుకోలేమని సోని తండ్రి ఎంత చెప్పినా.. తాము అడిగినంత ఇస్తేనే పెళ్లి జరుగుతుందని, లేకపోతే లేదంటూ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. వధువు వధువు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. అడిగినంత కట్నం ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ మార్కుల్ని సాకుగా చూపించి, వివాహం రద్దు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
