NTV Telugu Site icon

PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్‌వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనకు ‘చాయ్’కి ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేమైనదిగా చెప్పారు. ‘‘చిన్నతనంలో కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను. నేను టీ అందిచేవాడిని, మోడీకి టీకి మధ్య సంబంధం చాలా లోలైనది’’ అని ఈ రోజు మీర్జాపూర్ ‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.

సమాజ్ వాదీ పార్టీకి ఓటేసి ఎవరూ కూడా తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరని, మునిగిపోయే వారికి ఎవరు ఓటు వేయరని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తారని ప్రధాని అన్నారు. ప్రజలకు ఇండియా కూటమి గురించి చాలా బాగా తెలుసని, వారు మతవిద్వేషకులని, కులపిచ్చి ఉన్నవారని, వారు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఈ రెండింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూ.. యాదవ సామాజిక వర్గంలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన కుటుంబానికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు.

Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..

ఎస్పీకి చెందిన వ్యక్తులు పట్టుబడిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేవారని, ఇందులో ఎవరైనా పోలీస్ అధికారి అయిష్టంగా ఉంటే అతడిని సస్పెండ్ చేసేవారని, యూపీ, పూర్వాంచల్‌ని మాఫియాకు అడ్డాగా మార్చారని ప్రధాని అననారు. ఎస్పీ ప్రభుత్వం మాఫియాను ఓటు బ్యాంకుగా చూసిందని అన్నారు. యూపీ సీఎం ‘‘స్వచ్ఛతా అభియాన్’’ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఎస్పీ ప్రభుత్వం హయాంలో ప్రజానీకం ఈ మాఫియాకు వణికిపోయేవారని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మాఫియా వణికిపోతోందని ఆయన అన్నారు.

ఇండియా కూటమి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు.మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని మన రాజ్యాంగం చెబుతోందని, అయితే, ఎస్పీ మాత్రం తన మేనిఫెస్టోలో దళితులు, వెనబడిని తరగతుల వారి రిజర్వేషన్లను ముస్లింకు ఇవ్వాలని పేర్కొందని చెప్పారు. దీని కోసం రాజ్యాంగం కూడా మారుస్తామని ఎస్పీ చెబుతోందని, పోలీస్, పీఏసీల్లో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ చెబుతోందని, వారి ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలకు తాను అంకితమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.