Site icon NTV Telugu

Assam: అస్సాం ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి.. ముగ్గురు సైనికులకు గాయాలు

Assam

Assam

అస్సాంలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. బి.ఫార్మ్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు

శుక్రవారం తెల్లవారుజామున అస్సాంలోని కాకోపాథర్‌లోని భారత సైన్యంపై భారీగా ఆయుధాలు ధరించిన తిరుగుబాటుదారులు దాడి ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై ప్రతిఘటించాయి. ఆర్మీ క్యాంప్ సమీపంలో దాదాపు గంటసేపు కాల్పులు కొనసాగాయి. ఈ దాడిలో ముగ్గురు సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక సంఘటన తర్వాత స్థానిక పోలీసుల సమన్వయంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్‌ మొదలు పెట్టాయి. దాడి చేసిన వారు ఒక ట్రక్కును ఉపయోగించారని భావిస్తున్నారు. అనంతరం ఆ ట్రక్కు పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని తెంగపాణి ప్రాంతంలో వదిలివేసి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ ఏం జరగలేదు.. ఖండించిన భారత్

Exit mobile version