Green Data Center: హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్.. రూ.3350 కోట్ల పెట్టుబడులు..
- హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్..
- ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ భారీ పెట్టుబడులు..
- ఏఐ ఆధారిత నెక్స్స్ జెన్ సేవలను అందించే లక్ష్యం..
- దశలవారీగా దాదాపు రూ 3350 కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Data Center: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు భారీగా స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే 11 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పలు సంస్ధలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు, వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించాయి. తాజాగా ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3350 కోట్లు) పెట్టుబడులకు సిద్ధపడింది.
Read also: PM Modi on Wayanad: నేడు వయనాడ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. ఆ ప్రాంతాల పరిశీలన..!
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.
Read also: Minister Jaishankar : మాల్దీవులకు చేరుకున్న విదేశాంగ మంత్రి.. సంబంధాలు మెరుగుపడేనా?
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. అరమ్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ కొత్త డేటా సెంటర్ ఏర్పాటును మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతించారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని అన్నారు. తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్ తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా అన్నారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!