Site icon NTV Telugu

US Predator drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకి రక్షణ శాఖ ఆమోదం..

Us Predator Drone Deal

Us Predator Drone Deal

US Predator drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల(MQ-9B సీగార్డియన్ డ్రోన్) కొనుగోలు ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) గురువారం ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది. అయితే ఈ కొనుగోలుకు ప్రక్రియకు ముందు ఈ డీన్ ను భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. యూఎస్ కు చెందిన జనరల్ అటామిక్స్ ఈ ప్రిడెటర్ డ్రోన్లను తయారు చేసింది. తాలిబాన్, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్లలో ఈ డ్రోన్లు అత్యంత విజయవంతమయ్యాయి.

Read Also: Interfaith Affair: మతాంతర సంబంధం.. ముక్కలు ముక్కలుగా నరికేసి..

అధిక ఎత్తులో ప్రయాణించే లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు స్ట్రైక్ క్షిపణులను కలిగి ఉంటాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల లక్ష్యాలను చేధించగలవు. దేశ సరిహద్దుల్లో, సముద్ర ప్రాంతాల్లో సుదూర నిఘా కోసం ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. భారత నావికాదళం ఈ ఒప్పందానికి ప్రధాన ఏజెన్సీగా ఉంది. దీనిలో 15 డ్రోన్లు, వాటి బాధ్యత, నిఘా కార్యకలాపాల కోసం ఇండియన్ నావీకే వెల్లనున్నాయి. అయితే డ్రోన్లను సైన్యంలోని మూడు విభాగాలకు సమానంగా పంపిణీ చేసి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం ఆపరేట్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం చర్చల్లో ఉన్న MQ-9B సీగార్డియన్ డ్రోన్లను, అమెరికాకు చెంది జనరల్ అటామిక్స్ అనే రక్షణ సంస్థ తయారు చేసింది. MQ-9 ఎనిమిది లేజర్-గైడెడ్ క్షిపణులను, ఎయిర్-టు-గ్రౌండ్ మిస్సైల్-114 హెల్‌ఫైర్ ద్వారా అత్యంత ఖచ్చితంగా టార్గెట్లను ధ్వంసం చేయగలదు. యాంటీ ఆర్మర్, యాంటీ పర్సనల్ ఎంగేజ్‌మెంట్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద రెండు ప్రిడెటర్ డ్రోన్లు ఉన్నాయి. వీటిని ఒక అమెరిక్ సంస్థ నుంచి లీజుకు తీసుకున్నారు. హిందూ మహాసముడ్రంపై నిఘాకు నేవీ వాడుతోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఈ డీల్ పూర్తి చేయాలని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి చేస్తోంది. అయితే తాజాగా ఈ కొనుగోలుకు రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ లభించింది.

Exit mobile version