Site icon NTV Telugu

Delhi: యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!.. చమురు, గ్యాస్‌పై కీలక సమాచారం

Gas

Gas

గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా దాడులు-ప్రతికార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. దీంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రస్తుతం ఎక్కడికక్కడే చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సంక్షోభం రావొచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారతదేశంలో కూడా నిల్వలు కూడా తగ్గుపోతున్నాయని జోరుగా ప్రచారం జరిగింది.

ఇలాంటి వదంతుల నేపథ్యంలో కేంద్ర వర్గాల నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇంధన భద్రత విషయంలో భారతదేశం చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిల్వలు ఉన్నాయని.. ప్రతి రోజూ స్టాక్ భర్తీ జరుగుతోందని తెలిపాయి. ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ కొరత లేదని.. అలాగే ప్రపంచంలో కూడా ముడి చమురు కొరత కూడా లేదని.. భారతదేశం ఇతర సరఫరాదారులతో కూడా సంప్రదింపులు జరుపుతోందని వర్గాలు పేర్కొన్నాయి.

ఆస్ట్రేలియా, కెనడా కూడా భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ముందుకొచ్చాయని.. ఇతర ప్రత్యామ్నాయ వనరుల కోసం కూడా వెతుకుతున్నట్లు తెలిపింది. ఇటీవలే యూఏఈ, యూఎస్‌తో కూడా కొత్త ఒప్పందాలు జరిగినట్లుగా గుర్తుచేసింది. ప్రస్తుతం ముడి చమురు, ఎల్పీజీ కొనుగోలు చేయడానికి ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, వ్యాపారులతో చర్చలు జరుపుతోందని తెలిపాయి. భారతదేశం అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), పెట్రోలియం ఎగుమతి చేసే సంస్థల (OPEC)తో కూడా భారతదేశం చర్చలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశాయి. నౌకలకు బీమా పొందడానికి భారతదేశం యూఎస్‌తో చర్చలు జరుపుతోందని.. భారతదేశం రోజుకు రెండుసార్లు ఇంధన పరిస్థితిని సమీక్షిస్తోందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.

 

Exit mobile version