NTV Telugu Site icon

Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్

Free Fire Love Story

Free Fire Love Story

Gorakhpur Girl Eloped With Patna Boyfriend Who Met On Free Fire Game: పబ్జీ గేమ్ పుణ్యమా అని.. సీమా-సచిన్‌లు కలిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గానే ఉంది. ఇంతలో తాజాగా ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ ఒకటి వెలుగు చూసింది. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ కలిసిన ఓ అమ్మాయి, ఒక అబ్బాయి.. ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Double Bedroom: లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి తన మొబైల్‌లో తరచూ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఈమెకు బీహార్‌కు చెందిన సుజీత్‌తో పరిచయం అయ్యింది. రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. దీంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో.. వారికి చెప్పకుండా ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు.

WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియ‌న్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అన‌సూయ‌!

ప్లాన్ ప్రకారం.. యువతి తన ఇంట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి, జులై 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లింది. నేరుగా పట్నాలో ఉన్న సుజీత్ వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరు తట్టాబుట్టా సర్దుకొని, ఇంటి నుంచి పారిపోయారు. తమ కుమార్తె సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా కలిసిన ప్రేమికుడితో పారిపోయినట్లు విచారణలో తేలింది.

Varalakshmi Sarathkumar: అయ్యో పాపం.. వాటిని పోగొట్టుకున్న హీరోయిన్.. వీడియోలో..

ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమార్తె చదువుకుంటానని చెప్పడంతో ఆమెకు మొబైల్ ఫోన్ కొనిచ్చామని, కానీ ఆమె తమకు తెలియకుండా గేమ్ ఆడుకుంటూ ఉండేదని తెలిపారు. తమ కూతురిపై తాము పెద్ద దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. తమ అమ్మాయి బాగా చదువుకునేదని, ఇలాంటి పని చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. పోలీసులు ఆ ఇద్దరిని గాలించే పనిలో నిమగ్నమయ్యారు.

Show comments