NTV Telugu Site icon

Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..

Odisha

Odisha

Google Maps:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అదృష్టం కొద్దీ బతికారు.అంతకుముందు హైదరాబాద్‌కి చెందిన ఓ ఫ్యామిలీ ఇలాగే కేరళలో విహారయాత్రకు వెళ్తే ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

తాజాగా ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కటక్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సుజిత్య సాహు, సూర్య ప్రకాష్ మొహంతి, సుభాన్ మోహపాత్ర, హిమాన్షు దాస్ మరియు అరక్షితా మహపాత్ర బైక్‌లపై సప్తసజ్య ఆలయానికి బయలుదేరారు. కొండపై ఉన్న విష్ణుబాబా మఠంకి జూన్ 30 ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ఐదుగురు విద్యార్థులు దాదాపుగా దిక్కుతోచని పరిస్థితికి వెళ్లారు.

Read Also: Deputy CM Pawan Kalyan: అన్నింటిపై ఆరా తీస్తున్న పవన్‌ కల్యాణ్‌..

నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడటం వారు అడవి మధ్య 11 గంటల పాటు చిక్కుకుపోయారు. ఆలయానికి చేరుకున్న రోజు మధ్యాహ్నం 2 గంటల సమాచాని వారు నిస్సాహకులుగా మారారు. గూగుల్ మ్యాప్స్ వారిని సప్తసజ్య అడవిలో చాలా దూరం తీసుకెళ్లింది. అడవిలో చేరుకోలేని ప్రదేశానికి చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

చాలా అలసిపోయి ఆహారం లేకుండా సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలాకు చేరుకున్నారు. ఈ ప్రాంతానికి సందర్శకులను నిషేధించారు. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. అదే ప్రదేశంలో ఆగి, సహాయం కోసం ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నించారు. చివరకు వారిలో ఒకరు పోలీసులను అతికష్టం మీద సంప్రదించగలిగారు. దెంకనల్ పోలీసులు, అటవీ శాఖ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి విద్యార్థుల్ని కనుగొన్నారు. రెండు బృందాలు వీరి కోసం అడవిలో గాలించాయి.

‘‘ మేము ఆలయాన్ని సందర్శించాలనుకున్నాము. మేము ఆలయాన్ని అంచెలంచెలుగా దాటి కొండపైకి వచ్చాము మరియు అక్కడ ఒక సుందరమైన ప్రదేశం ఉందని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత, మాకు సబ్‌వేలు తప్ప సరైన మార్గం కనుగొనబడలేదు. మేము పొరపాటు చేసాము. సందర్శకులు నిషేధించబడిన భూషుని ఖోలాకు చేరుకున్నారు, మరియు బయటికి వెళ్లే మార్గం కనుగొనలేకపోయాము.’’ అని బాధితుల్లో ఒకరు చెప్పారు. దాదాపుగా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.