Site icon NTV Telugu

Goods trains collide: గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 బోగీలు..

Goods Trains Collide.

Goods Trains Collide.

Goods trains collide: ఒడిశాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదం ఘటనను ప్రజలు మరిచిపోలేకపతున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మూడు దశాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రైలు దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్ల ఢీకొనడం వల్ల 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బంకురాలో జరిగింది. ఒండా స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు లోకో పైలట్ కి స్వల్పగాయాలయ్యాయి.

Read Also: Manipur Violence: సైన్యాన్ని ముట్టడించిన 1500 మంది.. 12 మంది మిలిటెంట్ల విడుదల..

రైల్వే అధికారుల ప్రకారం.. రెండు ఖాళీ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయని, ప్రమాదానికి కాణం ఏమిటి..? రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రమాదంలో ఆద్రా డివిజన్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లోని నాలు జిల్లాలకు రైల్వే సేవలు నిలిచిపోయాయి. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా మరియు బుర్ద్వాన్, జార్ఖండ్‌లోని మూడు జిల్లాలు ధన్‌బాద్, బొకారో మరియు సింగ్‌భూమ్ ఆగ్నేయ రైల్వే పరిధిలోకి వస్తుంది.

జూన్ 2న ఒడిశా బాలాసోర్ లోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 275కు పైగా మంది మరణించారు. ముందుగా కోరమాండల్ రైలు వేగంగా గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆదే సమయంలో వేరేట్రాక్ లో ఎదురుగా వస్తున్న బెంగళూర్ రైలు, ట్రాకుపై పడి ఉన్న కోరమాండల్ రైలు బోగీలను ఢీకొట్టింది. దీంతో తీవ్ర ప్రమాదం జరిగింది.

Exit mobile version