Bihar Train Incident: డ్రైవర్ లేకుండా కదిలిన గూడ్సు రైలు.. తప్పిన భారీ ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goods Train Derailed In Samastipur Big Accident Averted: బీహార్‌లోని సమస్తిపూర్ శనివారం భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ లేకుండానే గూడ్స్ రైలు ఇంజిన్ అకస్మాత్తుగా పరుగులు తీయడం ప్రారంభించింది. దాంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనతో గందరగోళ వాతావరణం నెలకొంది. డ్రైవర్ లేకుండానే ఇంజిన్ ఎలా రన్ అయ్యిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో పెద్దగా నష్టం వాటిల్లకపోవడం ఊరటనిచ్చే అంశం.
Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్పూరిగ్రామ్ స్టేషన్‌లోని ర్యాక్ పాయింట్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు నుండి సిమెంట్ దించుతున్నారు. ఈ క్రమంలో గూడ్స్ రైలు ఇంజన్ ముందుకు కదలడంతో, అది పట్టాలు తప్పింది. ఇంజిన్‌కు సంబంధించిన నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో.. అక్కడ పనిచేస్తున్న కూలీల చేతులు, కాళ్లు వాచిపోయాయి. ఈ ఘటనపై కూలీలు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. సమస్తిపూర్ రైల్వే డివిజన్ అధికారులు, రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
ChatGPT: చాట్ జిపిటి నేర్చుకోండి.. కోట్లలో జీతాలు ఇస్తున్నారు..!
ఉదయం 10.30 గంటల సమయంలో ఇంజన్ ముందుకు కదలడం ప్రారంభించిందని కార్మికులు తెలిపారు. అప్పుడు దాన్ని ఆపేందుకు ఇంజిన్ చక్రంపై దిమ్మను కూడా ఉంచినట్లు వాళ్లు తెలిపారు. అయినప్పటికీ అది ముందుకు దూసుకుపోతే, కొంత దూరం వెళ్లాక పట్టాలు తప్పిందని వెల్లడించారు. బహుశా వాలు కారణంగా.. ఈ రైలు ఇంజిన్ ముందుకు కదిలి ఉండొచ్చని ఓ రైల్వే అధికారి తెలిపారు. మొత్తానికి కొన్ని గంటలపాటు రైల్వే సిబ్బంది కష్టపడి.. ఆ రైలుని తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!