NTV Telugu Site icon

Bihar Train Incident: డ్రైవర్ లేకుండా కదిలిన గూడ్సు రైలు.. తప్పిన భారీ ప్రమాదం

Bihar Train Accident

Bihar Train Accident

Goods Train Derailed In Samastipur Big Accident Averted: బీహార్‌లోని సమస్తిపూర్ శనివారం భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ లేకుండానే గూడ్స్ రైలు ఇంజిన్ అకస్మాత్తుగా పరుగులు తీయడం ప్రారంభించింది. దాంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనతో గందరగోళ వాతావరణం నెలకొంది. డ్రైవర్ లేకుండానే ఇంజిన్ ఎలా రన్‌ అయ్యిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో పెద్దగా నష్టం వాటిల్లకపోవడం ఊరటనిచ్చే అంశం.

Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్పూరిగ్రామ్ స్టేషన్‌లోని ర్యాక్ పాయింట్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు నుండి సిమెంట్ దించుతున్నారు. ఈ క్రమంలో గూడ్స్ రైలు ఇంజన్ ముందుకు కదలడంతో, అది పట్టాలు తప్పింది. ఇంజిన్‌కు సంబంధించిన నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో.. అక్కడ పనిచేస్తున్న కూలీల చేతులు, కాళ్లు వాచిపోయాయి. ఈ ఘటనపై కూలీలు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. సమస్తిపూర్ రైల్వే డివిజన్ అధికారులు, రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

ChatGPT: చాట్ జిపిటి నేర్చుకోండి.. కోట్లలో జీతాలు ఇస్తున్నారు..!

ఉదయం 10.30 గంటల సమయంలో ఇంజన్ ముందుకు కదలడం ప్రారంభించిందని కార్మికులు తెలిపారు. అప్పుడు దాన్ని ఆపేందుకు ఇంజిన్ చక్రంపై దిమ్మను కూడా ఉంచినట్లు వాళ్లు తెలిపారు. అయినప్పటికీ అది ముందుకు దూసుకుపోతే, కొంత దూరం వెళ్లాక పట్టాలు తప్పిందని వెల్లడించారు. బహుశా వాలు కారణంగా.. ఈ రైలు ఇంజిన్ ముందుకు కదిలి ఉండొచ్చని ఓ రైల్వే అధికారి తెలిపారు. మొత్తానికి కొన్ని గంటలపాటు రైల్వే సిబ్బంది కష్టపడి.. ఆ రైలుని తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చారు.