Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపింది మేమే..
- వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఆడియో..
- డ్రగ్స్, ఆయుధాల రవాణా కారణాల వల్లే హత్య చేసినట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ కెనడాల్లోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు 2023లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పపట్టింది. రెండు దేశాలు కూడా తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవడం ఆ సమయంలో ఉద్రిక్తతల్ని పెంచాయి. కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-కెనడాల మధ్య సంబంధాలు మళ్లీ గాడినపడ్డాయి.
ఇదిలా ఉంటే, ఈ హత్యకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తామే నిజ్జర్‌ను హత్య చేశామని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చెప్పినట్లు లీకైన ఒక ఆడియో టేప్ సంచలనంగా మారింది. యూకేకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పమ్మాతో మాట్లాడుతున్న సమయంలో బ్రార్ ఈ హత్యకు సంబంధించిన కారణాలు వెల్లడించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డ్రగ్స్ విక్రయాల కోసం 16-17 ఏళ్ల యువకులను ఉపయోగించేందుకు నిజ్జర్ మద్దతు ఇచ్చేవాడని, డ్రగ్స్ విక్రయించేందుకు యువకుల్ని బ్లాక్మెయిల్ చేసే వాడని, వారిని ఇన్ఫార్మర్లుగా ఉపయోగించే వాడని బ్రార్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా నిజ్జర్ అక్రమ ఆయుధాల వ్యాపారంలో కూడా పాల్గొనే వాడని బ్రార్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే నిర్జర్ను హత్య చేసినట్లు చెప్పాడు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!