Site icon NTV Telugu

Mumbai: కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం.. మేరీ మాత అలంకరణపై భక్తుల ఆగ్రహం

Mumbai

Mumbai

ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: PM Modi-Ayodhya: ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు పోయాయి

ముంబైలోని చెంబూర్‌లో కాళీమాత విగ్రహం ఉంది. అయితే ఎప్పుడూ కాళీమాత రూపంలో ఉండే విగ్రహం ఒక్కసారిగా మేరీ మాత రూపంలో కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. గర్భగుడిలో మేరీ మాత పోలిన దుస్తులు ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక భక్తులు పూజారి రమేష్‌ను నిలదీయగా తిక్క సమాధానం ఇచ్చాడు. తనకు కలలో కాళీమాత కనిపించి.. తనకు మేరీ మాత రూపాన్ని ఇవ్వమని అడిగిందని చెప్పుకొచ్చాడు. దీంతో భక్తులకు మరింత కోపం తెప్పించింది. కొంత మంది స్థానికుల సాయంతో పూజారి ఈ పని చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూజారి రమేష్‌ను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ ఘటనలో ఎవరైనా పాల్గొన్నారా? లేదంటే ఇంకేమైనా కుట్ర జరిగిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో భక్తులంతా కాళీమాత విగ్రహం దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Exit mobile version