రతన్ టాటా అస్తమయం తర్వాత.. ఆయన ఇష్టపడే శునకం దీనంగా ఎదురుచూస్తోంది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. దీంతో దీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రతన్ టాటాకు మూగ జీవాలంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా పెంపుడు జంతువులను.. అందులో కుక్కలను ఎక్కువగా ఇష్టపడేవారు. రతన్ టాటాకు మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.. పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉందని కింగ్ చార్లెస్‌ను కలిసే ప్రోగ్రామ్‌ను కూడా రతన్ టాటా వాయిదా వేసుకున్నారు. మనసుకు హత్తుకునే ఈ సంఘటనను సుహెల్ సేథ్ అనే భారతీయ వ్యాపారవేత్త ఈ విషయాన్ని వెల్లడించారు. రతన్ టాటా నుంచి తనకు 11 మిస్డ్ కాల్స్ వచ్చాయని చివరకు తనను సంప్రదించగా తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోలేనని రతన్ టాటా చెప్పినట్లుగా సుహెల్ సేథ్ తెలిపారు. ఇది విన్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను అభినందించారు.
ఇది కూడా చదవండి: Omar Abdullah: ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నిక.. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు
ఇక దత్తత తీసుకున్న కుక్క పేరు గోవా. రతన్ టాటాకు ఇష్టమైన కుక్క. గోవాలో దొరకడంతో దానికి ఆ పేరు పెట్టారు. సమావేశాలకు గోవా కూడా రతన్‌తో కలిసి వెళ్లేది. గోవాలోని టాటా సహోద్యోగి కారులో ఈ కుక్కను తీసుకొచ్చారు. ఆ తర్వాత ముంబై వరకు కారులో కూర్చుంది. ఈ ఏడాది జూలైలో రతన్ టాటా ముంబైలో చిన్న జంతు ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందేలా నిపుణులైన వైద్యులు కూడా ఇక్కడ సేవలందిస్తున్నారు.