NTV Telugu Site icon

Go First flight: గాల్లో ఉండగానే పగిలిన విండ్ షీల్డ్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Go First Flight

Go First Flight

Go First plane Wind shield is broken: ఇండియాలో వరసగా పలు సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గాల్లో ఉండగానే విమానాాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో సంఘటన జరిగింది. గో ఫస్ట్ సంస్థకు చెందిన ఏ 320 నియో విమానం గాల్లో ఉండగానే ఫ్లైట్ అద్దాల పగిలిపోయింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే విమానాాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.

రెండు రోజుల వ్యవధిలో మూడు గోొ ఫస్ట్ ఫ్లైట్స్ విమానాలు సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. మంగళవారం ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఎయిర్ ఏ320 వీటీడబ్ల్యూజీఏ విమానంలో ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తతెత్తడంతో ఢిల్లీకి మళ్లించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న మరో గో ఎయిర్ ఏ 320 డబ్ల్యూజేజీ విమానంలో కూడా ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శ్రీనగర్ విమానాశ్రయానికి మళ్లించారు.

Read Also: Alcohol Abusers: దేశంలో ఎంతమంది ఆల్కహాల్ తాగుతున్నారో తెలిస్తే షాకవుతారు..!!

గడిచిన ఆదివారం రెండు అంతర్జాతీయ విమానాలు విదేశీ గడ్డపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న డిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాకిస్తాన్ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు కాలికట్ నుంచి దుబాయ్ ఎళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో సమస్య ఏర్పడటంతో దీన్ని ఒమన్ దేశం మస్కల్ లో ల్యాండ్ చేశారు.