NTV Telugu Site icon

P. Chidambaram: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా చదివింది..

Chidambaram

Chidambaram

P. Chidambaram: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం తన ఎక్స్ వేదికగా వ్యాఖ్యనించారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 2024 మ్యానిఫెస్టోను చ‌దవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ ను కాపీ కొట్టిన‌ట్లు వెల్లడించారు. అప్రెంటిషిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నార‌ని, ఆ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం చాలా సంతోష‌క‌రంగా ఉందని ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు.

Read Also: Police Phone Recovery: 21 లక్షల విలువ చేసే 210 ఫోన్స్ స్వాధీనం.. బాధితులకు ఫోన్స్ అందచేత..

అలాగే, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న మ‌రి కొన్ని ఐడియాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి కాపీ కొడితే బాగుండేంద‌ని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. మిస్సైన వాటిని కూడా తొందరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఏంజిల్ ట్యాక్స్‌ను ర‌ద్దు చేస్తాన‌మి చెప్పడం కూడా చాలా సంతోష‌క‌ర‌మైన విష‌య‌ం.. ఎన్నో ఏళ్లుగా ఏంజిల్ ట్యాక్స్‌ను క్యాన్సిల్ చేయాలని కోరాం.. త‌మ మ్యానిఫెస్టోలోని 31వ పేజీలో ఆ విషయాన్ని ప్రస్తావించినట్లు కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం గుర్తు చేశారు.