NTV Telugu Site icon

UP: అబ్బాయి కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు బాలికలు

Up

Up

నేటి యువతరం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే.. పిల్లలేమో పెడదోవ పడుతున్నారు. భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాల్సిన వయసులో గాడి తప్పుతున్నారు. చదువు.. బుద్ధి, జ్ఞానాన్ని ఇస్తుంటారు. కానీ నేటి బాలికలు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒక అబ్బాయి కోసం ఏకంగా నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: 31st December: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. భారీగా కండోమ్స్‌ అమ్మకాలు..

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని పాఠశాలలో అబ్బాయితో పాటు బాలికలిద్దరూ 10వ తరగతి చదువుతున్నారు. అబ్బాయితో తరుచుగా అమ్మాయిలిద్దరూ మాట్లాడుతుండేవారు. తాజాగా బాలికలిద్దరూ.. అతడే ఇష్టమని బహిరంగా తెలిసింది. అంతే ఇంకేముంది.. బాలికలిద్దరూ స్కూల్ బయట గొడవకు దిగారు. స్కూల్ యూనిఫాంలో ఉన్నామన్న కనీస స్పృహ లేకుండా జుట్టులు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడి తన్నుకున్నారు. దారిన పోయి బాటసారులు వచ్చి విడదీసే ప్రయత్నం చేసినా ఆగలేదు. విడదీసుకుని మరీ కలపడ్డారు. ఈ సంఘటన సింఘ్‌వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీనగర్ సరాయ్ టౌన్‌లో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Tragedy: భార్యతో గొడవ, బావిలో దూకిన భర్త.. రక్షించే క్రమంలో మరో నలుగురు మృతి..

 

Show comments