NTV Telugu Site icon

Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్‌ఫ్రెండ్ దాడి..

Viral Video

Viral Video

Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్‌గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సదరు వ్యక్తి తన భార్య కోసం మొబైల్ ఫోన్ కొనేందుకు వెళ్తున్నాడని తెలిసి, అతడి గర్ల్ ఫ్రెండ్ కోపంతో ఆ షాపుకు వెళ్లి గొడవ పడింది. అయితే, తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలియదని ఆమె చెప్పింది. తామిద్దరం రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ఆమె చెప్పింది. తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకుని, అతడి చొక్కాను పట్టుకుని చెంపదెబ్బ కొట్టింది.

Read Also: Junaid Jaffer: రంజాన్ ఉపవాసం ఎఫెక్ట్?.. క్రికెట్ ఆడుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ మృతి..

సదరు వ్యక్తిని అతడి గర్ల్ ఫ్రెండ్ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, అతను స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఆమె కాల్స్‌కి సమాధానం ఇవ్వలేదు. అతను తన భార్య కోసం మొబైల్ ఫోన్ కొనేందుకు వస్తున్నాడని తెలుసుకున్న మహిళ, షాపుకు వెళ్లి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడి చొక్కా పట్టుకుని, చెంపపై కొట్టింది. ఇలా చేస్తు్న్న సమయంలో సదరు వ్యక్తి నుంచి అస్సలు ‘‘పశ్చాత్తాపం’’ కనిపించలేదు. తన కొత్త భార్య కోసం మొబైల్ కొనేందుకు షాపుకు వచ్చినట్లు అతడు ఒప్పుకున్నాడు.

‘‘మరి నేను ఎవరు..? రెండేళ్లుగా నాతో ఏం చేస్తున్నావు..?’’ అని ఆగ్రహంతో ఊగిపోయింది. అయితే, ఈ వివాదంలో షాపు యజమాని జోక్యం చేసుకుని, తమ దుకాణంలో గొడవ పెట్టుకోవద్దని కోరాడు. అతను నాకు చాలా అన్యాయం చేశాడు, తాను పోలీసుల వద్దకు వెళ్తున్నాని, తనను ప్రేమించి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పింది. ఇప్పటికే ఇతను ఇద్దరి పెళ్లి చేసుకున్నాడని, తనతో ఉన్న సంబంధాన్ని దాచి ఉంచాడని మహిళ ఆరోపించింది.