Site icon NTV Telugu

Get Out Ravi: గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్ సర్కార్.. “గెట్ అవుట్ రవి” యాష్ ట్యాగ్ ట్రెండింగ్

Tamil Nadu

Tamil Nadu

Get Out Ravi: తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార డీఎంకే, గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రసంగం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ‘‘ గెట్ అవుట్ రవి’’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడు ప్రజలు, డీఎంకే పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గవర్నర్ రవికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Man Hand Chopped: వ్యక్తి చేయి నరికి, ఎత్తుకెళ్లిన దుండగులు..

2023 తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం సమయంలో తమిళనాడు ప్రభుత్వం, పెరియార్,కామ రసకర్పూరం, ద్రావిడాది మోడల్ పదాలను విడిచిపెట్టి గవర్నర్ ప్రసంగించారు. దీన్ని డీఎంకే పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదవకపోవడం సభ నిబంధనలకు విరుద్ధం అని సీఎం స్టాలిన్ అన్నారు. గవర్నర్ సొంత ప్రసంగాన్ని రికార్డుల్లోకి ఎక్కించవద్దని స్టాలిన్ ప్రభుత్వం సభలో తీర్మానం చేసింది. తీర్మానం చేసే సమయంలో గవర్నర్ రవి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో జరిగిన వివాదం తరువాత గవర్నర్ పై డీఎంకే నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలతో ాటు గవర్నర్ ను సీఎం స్టాలిన్ పరుగెత్తిస్తున్నారంటూ మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ‘‘ గెట్ అవుట్ రవి’’ అంటూ చెన్నైలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లను కూడా అందించారు.

Exit mobile version