Site icon NTV Telugu

Bengaluru: బెంగళూర్ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం..

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్ లోని కలాసిపాల్య బస్టాండ్‌లో పేలుడు పదర్థాలు పట్టుబడటం భయాందోళనలకు గురిచేసింది. స్థానిక పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) బస్టాండ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో సమీపంలోని ప్లాస్టిక్ కవర్‌లో దాచిన ఆరు జెలిటిన్ స్టిక్స్ దొరికాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టుబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Read Also: US: “చట్టాన్ని ఉల్లంఘిస్తే, వీసా కోల్పోతారు”.. అమెరికా బిగ్ వార్నింగ్..

ఈ సంఘటనను ధృవీకరిస్తూ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) మాట్లాడుతూ, “కలాసిపాల్య BMTC బస్ స్టాండ్ లోపల టాయిలెట్ వెలుపల ఉంచిన క్యారీ బ్యాగ్ నుండి ఆరు జెలటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లు విడివిడిగా దొరికాయి. FIR ఇంకా నమోదు కాలేదు.” అని చెప్పారు. టాయిలెట్ దగ్గర పనిచేసే సిబ్బంది మాట్లాడుతూ.. వాష్ రూం వాడిన తర్వాత కొందరు బ్యాగులు మరిచి వెళ్తుంటారు. అలాంటి వారు తిరిగి వచ్చి వారి బ్యాగులను తీసుకుంటారు. అయితే, ఈ బ్యాగు గురించి ఎవరూ రాలేదు. మేము ఈ విషయాన్ని గార్డుకు తెలియజేశాం.

గుర్తుతెలియని వ్యక్తి ఈ బ్యాగ్ విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు తీసుకువచ్చాయి అనే దానిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు. జెలటిన్ స్టిక్స్ అనేవి చాలా పరిశ్రమలు, మైనింగ్, నిర్మాణ రంగం, రోడ్లు, రైల్వేలు, సోరంగాల వాటి కోసం వాడే చౌకైన పేలుడు పదర్థాలు. డిటోనేటర్స్ లేకుండా వీటిని ఉపయోగించలేము.

Exit mobile version