Site icon NTV Telugu

Geert Wilders: భారత్ హిందూ దేశం, జీహాదీల నుంచి హిందువులను రక్షించండి.

Geert Wilders

Geert Wilders

దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ హత్య కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఇద్దరు మతోన్మాదులు కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా తల కోసి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లో జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంతో పాటు ఉదయ్ పూర్ తో పాటు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్ మంగళవారం ఉదయ్ పూర్ హత్యపై స్పందించారు. ‘‘ అసహనం పట్ల సహనంగా ఉండకండి’’ అని భారత్ ను హెచ్చరించాడు. భారతదేశం హిందువులు సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. దయచేసి భారత్ దేశానికి మిత్రుడిగా చెబుతున్నా.. అసహనంపై సహనంగా ఉండకండి. ఇస్లాంను బుజ్జగించవద్దని, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. హిందువులను 100 శాతం రక్షించే నాయకులే అర్హులు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

‘‘భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉండాలి. ఇది వారి దేశం, వారి మాతృభూమి, ఇది వారిది. భారతదేశం ఇస్లామిక్ దేశం కాదు’’ అని వ్యాఖ్యానించాడు. అతివాదులు, ఉగ్రవాదులు, జీహాదీల నుంచి హిందు మతాన్ని రక్షించండి అని కోరారు. గతంలో నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ఆమెకు మద్దతుగా నిలిచాడు గీర్ట్ వైల్డర్. ఆమెను సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

 

 

Exit mobile version