Site icon NTV Telugu

PM’s Oath Event: ప్రధాని మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న తారలు, పారిశ్రామికవేత్తలు

Srj

Srj

PM’s Oath Event: ఈ రోజు జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Read Also: Terrorist Attack: యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు.. పలువురు మృతి..

ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 72 మందితో మోడీ 3.0 కేబినెట్ ఉండబోతోంది. ఇందులో 30 మంది కేంద్రమంత్రులు కాగా, మిగిలిన వారు సహాయమంత్రులుగా ఉండబోతున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, శివసేన, జేడీయూ, ఎల్జేపీ వంటి మిత్రపక్షాలకు సంబంధించి 11 మందికి మంత్రి పదవులు దక్కాయి.

ఇదే కాకుండా పొరుగుదేశాలు ఫస్ట్ అనే భారత విధానానికి అనుగుణంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. పీఎం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హజరయ్యారు.

Exit mobile version