Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట
- గ్యాస్ కొరతకు చెక్.. సరఫరా 20% పెంపు
- హోటళ్లు, పరిశ్రమలకు ప్రాధాన్యత
- వలస కార్మికులకు ఉచిత సిలిండర్లు
- రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్‌లో గత మూడు వారాలుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తక్షణమే 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత కారణంగా అనేక రెస్టారెంట్లు, డాబాలు , హోటళ్లు మూతపడే పరిస్థితి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన సరఫరాలో మొదటగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు , డైరీ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది.
Sundeep Kishan: సందీప్ కిషన్‌తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ఎల్లుండి (మార్చి 23) నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను విధించింది. కమర్షియల్ యూజర్లు , వలస కూలీలు సంబంధిత యాప్‌ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, కేవలం సరఫరాను క్రమబద్ధీకరించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!