NTV Telugu Site icon

Atiq Ahmed: నన్ను జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తారు.. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడి ఆరోపణలు

Ashraf Ahmed

Ashraf Ahmed

Atiq Ahmed: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్‌కు ప్రయాగ్ రాజ్ కోర్టు ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు విధించింది. అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ తో పాటు మరో ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే అన్నదమ్ములకు ప్రస్తుతం ఎన్ కౌంటర్ భయం పట్టుకుంది. యూపీ పోలీసులు తమను ఎన్ కౌంటర్ చేస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. అతీక్ అహ్మద్ జైలు నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఆయన తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. తనను జైలు నుంచి బయటకు రప్పించి రెండు వారాల్లో చంపేస్తారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి తనతో ఇలా అన్నారని పేర్కొన్నాడు. అయితే ఆ అధికారి పేరు చెప్పేందుకు నిరాకరించాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్ లో ఆ పేరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి చేరుతుందని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బరేలీ జైలులో జైలులో ఉన్నాడు.

Read Also: Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?

నాపై పెట్టిన కేసులు నిరాధారమైనవి, నాపై పెట్టిన తప్పుడు కేసులతో నేను పడుతున్న బాధను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారని అష్రాఫ్ అన్నారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నారు. ఈ కేసులో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతీక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, 2006లో ఉమేష్ పాల్ ను అతీక్ అహ్మద్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకోవాలని బెదిరించారు. ఈ కేసులో మంగళవారం ప్రయాగ్ రాజ్ కోర్టు శిక్ష విధించింది అతీక్ అహ్మద్ కు జీవితఖైదు పడగా.. అఫ్రాఫ్ ను నిర్దోషిగా తేల్చింది. ఇదిలా ఉంటే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత నెల ఫిబ్రవరిలో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుపై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ సీరియస్ గా ఉన్నారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీలో ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఉమేష్ పాల్ హత్యలో పాలుపంచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారు.

Show comments